టీలో వెయ్యికోట్లతో కోకాకోలా, కేసీఆర్‌తో అదానీ(పిక్చర్స్)
హైదరాబాద్: పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులను కలుస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తమ పరిశ్రమల స్థాపన, విస్తరణపై ప్రతిపాదిస్తున్నారు.
తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో కోకాకోలా భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమవారం తెలిపారు. భారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కోకాకోలా ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, వైఎస్ ప్రెసిడెంట్ ఇల్‌రియల్, ఇండియా రీజినల్ హెడ్ టి కృష్ణకుమార్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
తెలంగాణలో కోకాకోలా కంపెనీ కార్యకలాపాలను కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. కోకాకోలాకు తెలంగాణ పెద్ద మార్కెట్ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని కోకాకోలా కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కోకాకోలా కంపెనీ ప్లాంట్‌కు సరైన భూమిని కేటాయించనున్నట్టు చెప్పారు.

కోకాకోలా
కోకాకోలాకు ప్రస్తుతం మెదక్ జిల్లా పటాన్ చెరులో ఒక ప్లాంట్ ఉంది. స్థల సేకరణ జరగగానే కొత్త ప్లాంట్ పనులు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, తెలంగాణ పారిశ్రామిక వౌళిక సదుపాయాల కార్పొరేషన్ ఎండి జయేష్ రంజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోకాకోలా
తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో కోకాకోలా భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమవారం తెలిపారు.

కోకాకోలా
కోకాకోలా ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, వైఎస్ ప్రెసిడెంట్ ఇల్‌రియల్, ఇండియా రీజినల్ హెడ్ టి కృష్ణకుమార్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

ఆదానీ
దేశంలోనే పేరెన్నికగన్న అదానీ గ్రూప్ తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతోంది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అదానీ గ్రూప్ చేపట్టనున్న కార్యకలాపాల గురించి గౌతం ఆదానీ ముఖ్యమంత్రికి వివరించారు.

ఆదానీ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం కోసం ఎదురు చూస్తున్నట్టు అదానీ కంపెనీ తెలిపింది. 2020 నాటికి తమ సంస్థ 2000మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరుకుంటుందని, అవసరం అయిన రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు.

ఆదానీ
సింగిల్ విండో క్లియరెన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలకు కేటాయించాల్సిన భూమిని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించిందని అన్నారు. మౌళిక సదుపాయాల కల్పంచడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు.

ఆదానీ
విద్యుత్ కొరత ఎదుర్కొంటున్నామని, అదానీ గ్రూప్ విద్యుత్ సరఫరాకు ముందుకు రావడం సంతోషకరమని , దీని వల్ల విద్యుత్ కొరత నుంచి బయటపడతామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications