ఏపీ విద్యా సంస్కరణలకు కొలంబియా వర్శిటీ ఫిదా..

అమరావతి: రోజులు మారాయి.. మారుమూల గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్య అనే రెక్కలొచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీల్లో కీలక ఉపన్యాసాలను ఇచ్చే అరుదైన ఘనతను అందుకుంటోన్నారు.

ఆయా యూనివర్శిటీల్లో తలపండిన ప్రొఫెసర్ల ఎదుట ఏమాత్రం సంశయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉన్నాయో సగర్వంగా వివరించగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విద్యావిధానాల గురించి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు.

తమకోసం ..తమ వికాసం కోసం తమ ప్రభుత్వం ఎంతగా శ్రద్ధ పెడుతుందో ఆ పిల్లలే స్వయంగా చెబుతుంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నోరెళ్ళబెట్టి వినాల్సిన రోజులు వచ్చాయి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రపంచ దేశాలకే ఆదర్శవంతం అయ్యాయనడానికి ఆ నిరుపేద కుటుంబాల విద్యార్థులే ప్రత్యక్ష సాక్షులు.

జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోన్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ గత పాలకులు తప్పించుకోగా.. అదే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు షూస్ మొదలుకుని అత్యాధునిక ట్యాబ్‌లను సైతం అందజేసే బాధ్యతలను తీసుకుంది జగన్ సర్కార్.

Columbia University professor Jeffrey Sachs

జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ.. వంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర -అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏపీలో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు.ఇంకా విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని కాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారు.

ఈ నెల 26వ తేదీ వరకు జరిగే ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం విద్యకు ఇస్తోన్న ప్రాధాన్యత, దాన్ని అమలు చేస్తోన్న తీరు, పిల్లలు సైతం ఆ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత ప్రమాణాలను ఆకళింపు చేసుకుంటున్న తీరు అభినందనీయం అని ప్రఖ్యాత కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు.

ఈ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ మన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో విద్యావిధానంలో వచ్చిన మార్పులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తాము ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ, తమకు ప్రభుత్వం ఎంతగా తోడ్పాటును ఇస్తున్నదీ వివరించారు. 42 గౌరవ డాక్టరేట్లు పొందిన జెఫ్రీ సాచ్.. ఆ విద్యార్థుల పరిణితిని ప్రశంసించారు.

ఏపీ విద్యార్థులు చేసిన ప్రసంగం దేశదేశాల అధినేతలు, మంత్రులు, అధికారులను ఆకట్టుకుంది. న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంశంపై జరిగిన సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి యువత ఎంత కీలకం అన్నది వివరిస్తూ చెబుతుంటే ఆహూతులు మంత్ర ముగ్ధులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+