పవన్ కల్యాణ్ గెలుపుపై అలీ రియాక్షన్ .. మొత్తం వాళ్లే చేశారంటూ కామెంట్స్
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ,జనసేన , బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీ కొట్టాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 175 సీట్లగాను 164 సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరించనున్నారు.
కూటమి గెలుపై నటుడు, వైసీపీ నేత అయిన అలీ స్పందించారు. రాష్ట్ర ఎన్నికల్లో చాలా గొప్ప మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు , నా మిత్రుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియచేస్తున్నాను. పది సంవత్సరాల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారు. నేనెప్పుడు ఒకమాట చెప్తుంటా అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు... ప్రజలే న్యాయనిర్ణేతలు వారిచ్చిన తీర్పే ప్రతి ఒక్కరు గౌరవించాలి అని ఆయన తెలిపారు. గెలుపొటములు మొత్తం కూడా ప్రజల చేతుల్లోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

. డిప్యూటి సీఎంగా కొత్త బాధ్యతలు తీసుకున్న పవన్‌కళ్యాణ్ సినిమా రంగంలో మాదిరిగానే సంచలనాలు సృష్టించే పవర్‌స్టార్‌లా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనసారా కోరుకుంటున్నా అంటూ అలీ కూటమి నేతలకు అభినందనలు తెలిపారు.
ఇక అలీ విషయానికి వస్తే...సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారాయన. ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో జగన్ అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరుఫున అలీ ప్రచారం నిర్వహించారు. అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయిన తరువాత అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది.
జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా. నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడ కూడా కనిపించలేదు. కూటమి విజయం సాధించడంతో ఆయన వారికి అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications