అందరూ ఏకమైనా తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదు, రాజకీయ పునరేకీకరణకు ఛాన్స్ లేదు
విపక్షాలన్నీ ఏకమైనా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పెద్ద నగదు నోట్ల రద్దు అంశంతో ప్రధానికి మంచి ప్రజాదరణ లభించడంతో విపక్షాలు ఏకం అయ్యాయన్నారు.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు అంశంపై విపక్షాలన్నీ ఏకమైనా తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. వచ్చే ఎన్నిలలోపు రాజకీయ పునరేకీకరణకు అవకాశమే లేదన్నారు.
ప్రదానమంత్రి నరేంద్రమాడీకి వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వేలకనే విపక్షాలన్నీ గ్రూపులు కట్టాయని ఆయన ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలను ఆయన విమర్శించారు.

విపక్షాల్లో ఐక్యత లేదన్నారాయన.కొన్ని పార్టీల నాయకులు తమ పాపులారిటీని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో రాజకీయ పునరేకీకరణకు చాన్స్ లేదన్నారు వెంకయ్య.












Click it and Unblock the Notifications