జోహార్ సీఎం చంద్రబాబు..జోహార్ నారా లోకేశ్ ..టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి నిర్వాకం
విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, యువ నేత గంటా రవితేజ హాజరై సందడి చేశారు. వేదికపై తన తండ్రి ప్రసంగిస్తుండగా, సభికుల ముందుకొచ్చి రవితేజ ఇచ్చిన నినాదాలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
😂🤣 మినీ మహానాడు లో జోహార్ సీఎం చంద్రబాబు.... జోహార్ నారా లోకేశ్ pic.twitter.com/L5GWHANmfk
— Rahul (@2024YCP) May 20, 2025
అయితే గంటా రవితేజ ఈ సందర్భం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కార్యకర్తల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో "జోహార్ సీఎం చంద్రబాబు... జోహార్ నారా లోకేశ్" అంటూ రవితేజ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా రవితేజతో గొంతు కలిపి నినాదాలు చేశారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే గంటా రవితేజ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖారారు అయినట్టే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వారసుడిగా ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ పార్టీలో మరింత కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications