వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య చాంపియన్: కిరణ్ రెడ్డి వర్సెస్ వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర ఛాంపియన్‌షిప్ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మధ్య పోటీ నెలకొంది. సీమాంధ్ర ప్రాంతంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న జగన్‌కు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య ఈ విషయంలో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. సమైక్య ఉద్యమంలో ఏ పార్టీ, ఏ నేత నిలుస్తారనేది చర్చాంశనీయంగా మారింది.

వైయస్ జగన్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అయితే, ఎవరు సమైక్యాంధ్ర నేతగా ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకొన్న వెంటనే సమైక్యం విషయంలో తొలుత జగన్‌ పార్టీ స్పందించగా, వారం తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌ విభజ నపై తన అభ్యంతరాలను వ్యక్తంచేసి జనం దృష్టిని ఆకర్షించారు.

Kiran Reddy and YS Jagan

విభజన నిర్ణయం తీసుకోకముందునుంచే వీరిద్దరు సమైక్యవాదులనే ముద్రను వేసుకొనే ప్రయత్నం చేశారు. 2009లో నాడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన చేసినప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తంచేశారు. నాడు సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో జగన్‌ ప్లకార్డు పట్టుకొని కేంద్రప్రభుత్వానికి నిరసన వ్యక్తంచేశారు. దీంతో జగన్‌ను సమైక్యవాదిగా మొదటి నుంచి తెలంగాణవాదులు పరిగణిస్తున్నారు.

జులై 30న సిడబ్ల్యుసి సమా వేశంలో రాష్టవ్రిభజన దిశగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవడంతో తన ఎమ్మెల్యేల ద్వారా రాజీనామాలు చేయించి సీమాంధ్రలో సమైక్యం కోసం స్పందించిన తొలి పార్టీగా ముద్ర వేయించుకున్నారు. ఆ తరువాత స్వయంగా జగన్‌, ఆమె తల్లి విజయమ్మ విభజనకు వ్యతిరేకంగా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు.

ఆ తర్వాత విజయమ్మ విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దీక్షలు చేయగా, జైలులో స్వయంగా జగన్‌ దీక్షకు దిగారు. పోలీసుల దీక్ష భగ్నంచేయడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత స్వయంగా మళ్లీ తన నివాసమైన లొటస్‌పాంట్‌లో జగన్ దీక్ష చేశారు.

ఇదిలావుంటే, సమైక్యవాదాన్ని ఎంతో గట్టిగా సిఎంగా ఉండికూడా కిరణ్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరించి విభజనపై తన అభ్యంతరాలు వ్యక్తం చేశారనే క్రెడిట్‌ను దక్కించుకున్నారు. జగన్ సమైక్య శంఖారావం సభ నేపథ్యంలో ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాసి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి చర్చనీయాంశంగా మారారు. మొత్తం మీద, సమైక్యవాదంతో సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

English summary

 It is said that CM Kiran kumar Reddy and YSR Congress president YS Jagan are competing for the hegemony in Seemandhra with United Andhra slogan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X