• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రం మొత్తంమీద ఆ ఒక్క నియోజకవర్గానికే ఫుల్లు డిమాండ్?

వైసీపీ నుంచికానీ, టీడీపీ నుంచి కానీ అత్యధిక సంఖ్యలో ఆశావహులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపుతుంటారు.
|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తయితే ఆ ఒక్క నియోజకవర్గం మరో ఎత్తు. అధికారంలో ఉన్నవారుకానీ, ప్రతిపక్షంలో ఉన్నవారుకానీ కచ్చితంగా తామె గెలుస్తాం అనుకునే నియోజకవర్గం కింద దీన్ని లెక్కేసుకుంటారు. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అత్యధిక డిమాండ్ ఈ నియోజకవర్గం కోసం ఉంటుంది. రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలుచేసుకుంటే సులువుగా గెలుస్తామనే నమ్మకాన్ని, ధీమాను ఈ నియోజకవర్గం కల్పిస్తుంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా అందరూ ఇక్కడి నుంచి పోటీచేసేందుకు పావులు కదుపుతూ ఉంటారు.

గుంటూరు పశ్చిమలో పెరిగిన ఆశావహులు

గుంటూరు పశ్చిమలో పెరిగిన ఆశావహులు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి కీలకమైన అభ్యర్థులంతా తమ మొదటి ప్రాధాన్యత గుంటూరు పశ్చిమకే ఇస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు తనకే ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి యేసురత్నం కూడా మరోసారి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వైసీపీ నుంచి ఆరుగురు..

వైసీపీ నుంచి ఆరుగురు..

వైసీపీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలు చూసే లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా అధిష్టాన పెద్దల సూచనతో గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత రావడంతో దాన్ని అధిగమించేందుకు నియోజకవర్గ మార్పు చేస్తున్నారు. మొత్తం ఈ నలుగురితోపాటు గుంటూరు నగర మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు కూడా కాపు కోటాలో కర్చీఫ్ వేశారు.

టీడీపీ నుంచి నలుగురు

టీడీపీ నుంచి నలుగురు

తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోవెలమూడి రవీంద్ర ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. సీటు కోసం ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి తానే పోటీచేస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న డేగల ప్రభాకర్ కాపు కోటాలో సీటు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే తెనాలి నాదెండ్ల మనోహర్ కు కేటాయించి, గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను పోటీకి దింపాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. పొత్తు కుదిరితే, కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరితో గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేయడానికి అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి లేని గిరాకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఉంది. ఒక్కో పార్టీ నుంచి ఇన్నేసిమంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఎవరికి సీటిచ్చినా, ఎవరికి ఇవ్వకపోయినా తలనొప్పే. ప్రత్యర్థి పార్టీ పరాజయానికి కాకుండా సీటు దక్కలేదనే కారణంతో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకే ఎక్కువ అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

గుంటూరు పశ్చిమ సీటుకి భలే గిరాకీ

గుంటూరు పశ్చిమ సీటుకి భలే గిరాకీ


మొత్తంమీద గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటుకి భలే గిరాకీ కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ఆశావహులు ఎవరికి వారు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఇంత మంది కన్నేసి ఉండటంతో... సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి, ఇక్కడి టీడీపీ ఇన్‌ఛార్జ్‌కి ఏం చేయాలో పాలుపోక నీళ్లు నములుతున్నారని టాక్. మరి పోటీ చేసే ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే... వచ్చే ఎన్నికల వరకు ఆగా

English summary
The number of contestants from Guntur West Constituency is increasing day by day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X