జగనన్న ఇండ్ల నిర్మణాల్లో అక్రమాలు, ఆ మాజీ ఎమ్మెల్యేకి రూ. 200 కోట్లు, పరిటాల ఫైర్

అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, ఆయన ఈ కేసు నుండి ఏమాత్రం తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పరిటాల సునీత వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సుమారు రూ. 200 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. రాక్రీట్ సంస్థ పేరుతో సుమారు 50 వేల ఇండ్లు నిర్మించాలని, జగనన్న ఇండ్ల నిర్మాణం పేరుతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇసుక, ఇనుము, సిమెంటు దోచేశారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లాలోనే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కడప జిల్లా, పల్నాడు జిల్లాలలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సుమారు రూ. 200 కోట్లు పైగా దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు.

Complaint to CM Chandrababu to conduct vigilance inquiry into YCP Ex-MLA s irregularities

జగనన్న కాలనీలు, ఇండ్ల నిర్మాణం పేరుతో ఇండ్లు నిర్మించకుండానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బిల్లులు చేయించుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. ఇండ్ల బేస్మెంట్ నిర్మాణం కోసం రూ. 60,000 లో చెల్లించాల్సి ఉందని పరిటాల సునీత గుర్తు చేశారు. అయితే రాక్రీట్ సంస్థ ఇండ్లు నిర్మించకుండానే కేవలం బేస్మెంట్ నిర్మించుకుని బిల్లులు తీసుకుందని, ఈ స్కామ్ లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హస్తం ఉందని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు.

ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పార్థసారధికి ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమాలపై గతంలోనే హౌసింగ్ అధికారులు నివేదిక సిద్ధం చేసి అప్పగి జగన్ ప్రభుత్వానికి ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాకు చెప్పారు.

Complaint to CM Chandrababu to conduct vigilance inquiry into YCP Ex-MLA s irregularities

అయితే జగన్ ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ విషయం బయటకు రాకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. సుమారు రూ. 200 కోట్ల పైగా దోచుకున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై విజిలెన్స్ విచారణ జరిపించాలని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలు బయటకు తియ్యాలని చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశామని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాకు చెప్పారు. అనంతపురం జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రూ. 200 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం ఆ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+