వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్వోకేట్ల మధ్య వాగ్వాదం.!జోక్యం చేసుకున్న ధర్మాసనం.!రఘురామ వాదనలో ఆసక్తికర సన్నివేశాలు.!

|
Google Oneindia TeluguNews

న్యూ ఢిల్లీ/హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసు వాదనల సమయంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తరుపు న్యాయవాది మధ్య, రఘురామ తరుపు న్యాయవాది మధ్య వాగ్వాదం మోతాదు మించినట్టు తెలుస్తోంది. అడ్వొకేట్లిద్దరూ వాదులాడుకుంటున్న సందర్బాన్ని చూసి ధర్మాసనం స్వయంగా జోక్యం చేసుకోవడం హైలైట్ గా పరిణమించింది. ఇద్దరు అడ్వొకేట్ల మద్య వాదనలు తారాస్థాయికి చేరడానికి పరోక్షంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్థావనే కారణం కావడం కొసమెరుపు.

రఘురామ కేసులో ఆసక్తికర సంవాదన.. అడ్వొకేట్ల మద్య వాదోపవాదాలు..

రఘురామ కేసులో ఆసక్తికర సంవాదన.. అడ్వొకేట్ల మద్య వాదోపవాదాలు..


ఎంపీ రఘురామకృష్ణం రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరుపున వాదించిన అడ్వకేట్ మధ్య, రఘురామ తరుపు వాదించిన అడ్వకేట్ మధ్య వాడి వేడి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎంపీ రఘురామ హద్దులు మీరి అనుచిత వ్యాఖ్యలు చేసినా, కరోనా సంక్షోభ సమయంలో చర్యలు తీసుకోవడం సరికాదని ఉదాసీనంగా వ్యవహరిస్తే ఎంపీ హోదాలో శృతిమించి వ్యాఖ్యలు చేసారని దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారని దవే రఘురామ అడ్వకేట్ ని కోర్టు ఆవరణలోనే నిలదీసారు. అందుకు రఘురామ అడ్వకేట్ ముకుల్‌ రోహత్గీ సమయస్పూర్తిగా వ్యవహరించి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.

అడ్వొకేట్ల మద్య వాగ్వాదం.. సీఎం జగన్ ప్రస్థావనే కారణం..

అడ్వొకేట్ల మద్య వాగ్వాదం.. సీఎం జగన్ ప్రస్థావనే కారణం..


రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ, జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు. అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. సీఐడీ అదుపులో ఉండగా ఎంపీని చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని వైద్యనివేదికతో నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు.

వాదించుకున్న లాయర్లు.. జోక్యం చేసుకున్న ధర్మాసనం..

వాదించుకున్న లాయర్లు.. జోక్యం చేసుకున్న ధర్మాసనం..


రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ, జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని, ప్రాసిక్యూటర్ల మద్య వాగ్వాదం ఏంటని ధర్మాసనం మందలించింది. బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు.

Recommended Video

Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu
కోర్టు ఆవరణలో ఆసక్తికర ఘటన.. కోర్ట్ జోక్యంతో పక్కదారి పట్టని వాదనలు..

కోర్టు ఆవరణలో ఆసక్తికర ఘటన.. కోర్ట్ జోక్యంతో పక్కదారి పట్టని వాదనలు..


ఇరు వర్గాల అడ్వకేట్లు వాదించుకుంటున్న సమయంలో కేసు ఏ కీలక మలుపు తీసుకుంటుందోననే సందేహాలు తలెత్తాయి. కానీ వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఇరు వైపు వాదనలు పక్కదారి పట్టకుండా రఘురామ కాలు ఫ్యాక్చర్ వైపు తిరిగాయి. ఆ తర్వాత ఇరు అడ్వకేట్ల వాదనలు ముగిసిన తర్వాత దర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఎంపీ ఐనా సామాన్య మానవుడైనా న్యాయస్థానం దృష్టిలో ఒకటేనని, అన్యాయానికి గురైనప్పుడు న్యాయం చెప్పడమే న్యాయస్థానాల లక్ష్యమని ధర్మాసనం అభిప్రాయపడింది.

English summary
Rohatgi, a senior lawyer representing Raghurama, told the court that Jagan had sided with him under the pretext of filing a petition seeking revocation of his bail. Pro-government lawyer Dhave said Jagan was not dragged into the case because he was not a defendant. Rohatgi replied that he would say what he wanted to say as a petitioner. The tribunal reprimanded the two prosecutors over why they were arguing over the order and what the interrogation of the prosecutors was.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X