సచివాలయాల ఉద్యోగుల జీతాలపై సందిగ్ధత - సమస్య అక్కడే..!!

ఏపీలో వార్డు -గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు అందుతాయా. ఇప్పుడు ఈ విషయంలో కొంత మేర సందిగ్ధత ఏర్పడింది. ప్రభుత్వం ఈ నెల నుంచి ప్రోబేషన్ ఖరారు చేసిన ఉద్యోగులకు రెగ్యులర్ వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించటంతో పాటుగా.. నిబంధనలకు అనుగుణంగా వారి ప్రొబేషన్ ఖరారు చేసారు. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ పై చర్చల వేళ..సీఎం ఇచ్చిన హామీకి అనుగుణంగా వారి పే స్కేల్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సాంకేతిక కారణాలతో ఆలస్యం

సాంకేతిక కారణాలతో ఆలస్యం

అయితే, ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై స్పష్టత రావాల్సి ఉంది. 2022-23 బడ్జెట్‌ నుంచి ఆమెదం తీసుకోవటంతోపాటు.. కొత్త ఖాతాలు తెరవనందున పెరిగిన ఉద్యోగుల జీతాలతోపాటు ఇతర భత్యాల చెల్లింపు సాధ్యం కాదని ఉన్నతాధికారులు సచివాలయాలకు లేఖలు రాసిన అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో..ఈ నెల పెరిగిన వేతనాలు అందుతాయా లేదా అనేది సందేహంగా మారుతోంది. కొత్త పే స్కేల్ అందుకొనే వారికి ఆర్దిక శాఖ సూచనల మేరకు కొత్తగా ఖాతాలు ఓపెన్ చేయించాలని ఇప్పటికే ట్రెజరీల నుంచి సూచనలు అందాయి.

ఈ నెల నుంచే కొత్త వేతనాలు అందేనా

ఈ నెల నుంచే కొత్త వేతనాలు అందేనా


జూలై నుంచి పెరిగిన వేతనాలు అందుతాయని..వాటిని ఆగస్టు 1న ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా తమకు వస్తాయని వీరంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అది సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన 20233-23 బడ్జెట్ లో గతంలో ఇచ్చిన వేతనాలు రూ 15 వేల మేరకే అనుమతులు ఉన్నాయి. రెగ్యులర్ చేసిన ఉద్యోగుల జీతాలను పచెల్లించాలంటే అదనపు ప్రొవిజన్ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కొత్తగా అకౌంట్స్ తీసుకోవాలి.

సమస్య పరిష్కరిస్తామంటూ

సమస్య పరిష్కరిస్తామంటూ


ఆ తరువాత మాత్రమే పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతానాలకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ ద్వారా డ్రాయింగ్‌, డిస్‌బర్స్‌మెంట్‌ అధికారి ఉద్యోగుల జీతాలు, ఇతర భత్యాలను అనుమతి తీసుకోవటం..చెల్లింపులకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని పూర్తి చేయకుంటే ప్రభుత్వ పోర్టల్ అధికారిక చెల్లింపులకు అనుమతించదు.

దీంతో.. ఈ నెల వేతనాలు పైన ఇంకా డైలమా కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభమైందని..త్వరలోనే పెరిగిన వేతనాలు రెగ్యులర్ అయిన ఉద్యోగులకు అందుతాయని చెబుతున్నారు. దీంతో..వారం రోజుల సమయంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+