వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థం కావట్లేదు: భవిష్యత్తుపై గల్లా, మాకే నష్టమని ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Confusion in Seemandhra Congress leaders
హైదరాబాద్: తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని మంత్రి గల్లా అరుణ కుమారి అసెంబ్లీ లాబీల్లో సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఆమె లాబీల్లో మాట్లాడుతూ... తమ రాజకీయ భవిష్యత్తు అర్థం కావడం లేదని, ఈ దుస్థితికి కారణం ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారట.

మాకే నష్టం: ఆనం

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగకుంటే తమ ప్రాంతానికే నష్టమని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆయన సభాపతి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు.

అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. చర్చ జరగని పక్షంలో తమ ప్రాంతానికే నష్టమన్నారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు సభలో ఏం మాట్లాడుతారనే విషయమై సీమాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఇది పద్ధతి కాదు: ఎర్రబెల్లి

అసెంబ్లీని స్తంభింపచేసేలా నిరసన వ్యక్తం చేయడం సరికాదని టిటిడిపి నేత ఎర్రబెల్లి దాయకర రావు అన్నారు. బిల్లుపై చర్చ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ డ్రామాలు వద్దని సూచించారు.

జానా నివాసంలో టి కాంగ్ భేటీ

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. సభను వాయిదా వేయకుండా బిల్లుపై చర్చించే వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు.

English summary

 Minister Galla Aruna Kumari on Thursday talk about Seemandhra Congress leaders political future in Assembly lobby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X