‘కాంగ్రాట్స్ మోడీజీ..’, చంద్రబాబు అభినంద‌న‌లు, టీటీడీపీ నేత‌ల‌తో రేపు మరోసారి స‌మావేశం?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: సరళతర వాణిజ్యంలో భారత్ త‌న స్థానాన్ని మెరుగుప‌రుచుకున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు.

సరళతర వాణిజ్యంలో ర్యాకింగ్‌ను మెరుగుప‌డేలా చేసి, భార‌త‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత శ‌క్తిమంతంగా చేస్తున్నందుకు తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Congrats Modiji: AP CM, Tomorrow Chandrababu conducting one more meetig with TTDP Leaders?

భార‌త్‌లో సరళతర వాణిజ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి 15 వ ర్యాంకు వ‌చ్చింద‌ని అంటూ భార‌త్ ర్యాంకును మెరుగుప‌ర్చుకోవ‌డం శుభ సూచిక‌మ‌ని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు గురువారం మ‌రోసారి టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఇటీవ‌ల అమ‌రావ‌తిలో టీటీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

సరిగ్గా ఈ స‌మ‌యంలోనే టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగ‌ల్ నేత రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, తన శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

గురువారం నిర్వ‌హించ‌నున్న స‌మావేశంలో తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతంపైనే ప్రధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిసింది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఎలా ముందుకు వెళ్లాల‌న్న అంశంపై కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India jumped 30 spots to secure a place among the top-100 countries on World Bank's ease of doing business ranking list. In this regard, AP CM Chandrababu Naidu told that he is congratulating our Prime Minister Narendra Modi. And according to the sources, AP CM Babu is going to conduct one more meetig with TTDP leaders on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి