పులివెందుల సహా కాంగ్రెస్ అభ్యర్దుల ప్రకటన..!!
ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే పార్టీ అభ్యర్దులను కాంగ్రెస్ ప్రకటించింది. 38 మంది ఎమ్మెల్యే అభ్యర్దుల జాబితా వెల్లడించింది. ఈ నెల 25తో ఏపీలో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో...పెండింగ్ ఎంపీ స్థానాలకు క్లియర్ చేసిన కాంగ్రెస్..తాజాగా ఎమ్మెల్యే అభ్యర్దులను ఫైనల్ చేసింది. పులివెందులలో జగన్ పైన పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ ఖరారు చేసింది. వైసీపీ వర్సస్ టీడీపీ కూటమి మధ్య పోరు హోరా హోరీగా మారిన వేళ కాంగ్రెస్ అభ్యర్దుల పోటీ కీలకంగా మారుతోంది.
38 మంది పేర్లు ప్రకటన
ఏపీ నుంచి పోటీ చేసే 38 మంది కాంగ్రెస్ అభ్యర్దులను పార్టీ ప్రకటించింది. పులివెందుల నుంచి వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుండటంతో..సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్య పోటీ చేస్తారని పార్టీలో చర్చ జరిగింది. అయితే, తాజాగా పార్టీ విడుదల చేసిన జాబితాలో పులివెందుల అభ్యర్దిగా మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డిని బరిలోకి దింపారు. ముఖ్యమంత్రి జగన్ పైన ఆయన పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ పోటీ పైన ఆసక్తి పెరుగుతోంది. ఇక, బొబ్బలి నుంచి మరిపి విద్యాసాగర్, శ్రీకాకుళం నుంచి అంబటి క్రిష్ణారావు, గజపతి నగరంల నుంచి డోలా శ్రీనివాస్ పేర్లను ప్రకటించారు.

వైసీపీ నుంచి వచ్చిన వారికి
నెల్లిరమర్ల నుంచి సరగడ రమేష్ కుమార్, విశాఖ నార్త్ నుంచి లక్కరాజు రామారావు, చౌడవరం నుంచి జగత్ శ్రీనివాస్, ఎలమంచిలి నుంచి నర్సింగరావు, కోనసీమ గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, ఆచంట నుంచి నెక్కంటి వెంకట సత్యనారాయణ, విజయవాడ తూర్పు నుంచి సుంకర పద్మశ్రీ, జగ్గమయ్యపేట నుంచి కర్నాటి అప్పారావు, తాడికొండ నుంచి సుశీల్ రాజా, రేపల్లె నుంచి మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి నుంచి షేక్ బాషీద్, గుంటూరు పశ్చిమం నుంచి డాక్టర్ రాచకొండ జాన్ బాబు, చీరాల నుంచి ఆమంచి క్రిష్ణమోహన్, ఒంగోలు నుంచి నాగలక్ష్మి, కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి, కావలి-పొదలకురి కల్యాణ్, కోవూరు - నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి నుంచి శ్రీకాంత్ రెడ్డి పేర్లను ఖరారు చేసారు.

ప్రభావం చూపిస్తారా
గూడూరు - డాక్టర్ రామక్రిష్ణారావు, సుళ్లూరుపేట - శివ, వెంకటగిరి - పంతా శ్రీనివాసులు, కడప -అస్జల్ అలీ ఖాన్, ప్రొద్దుటూరు - మహ్మద్ నజీర్, మైదుకూరు - గుండ్ల కుంట శ్రీరాములు, ఆళ్లగడ్డ - హుస్సేన్, శ్రీశైలం - సయ్యద్ ఇస్మైల్, బనగానపల్లె - పుల్లయ్య, డోన్ - మధులేటి స్వామి, ఆోని - గొల్ల రమేష్, ఆలూరు - నవీన్ కిశోర్, కల్యాణదుర్గం - రాం భూపాల్ రెడ్డి, హిందూపురం - ఇనయతుల్లా, ధర్మవరం నుంచి అశ్వథ్ నారాయణ పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గన్నవరం, చీరాల లో వైసీపీ నుంచి వారికే సీట్లు కేటాయించారు. అయితే, కూటమి - వైసీపీ మధ్య పోటీపోటీగా సాగుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్దుల పోటీ.. ఓటింగ్ అంశం కీలకంగా మారనుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications