కొత్త జాబితా: ఏపీ లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జీలు వీరే: బాపిరాజుకు సీట్ కన్‌ఫర్మ్
Lok Sabha elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు విడతల్లో 38 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో విడత జాబితాపై కసరత్తు పూర్తి చేసింది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. మిత్రపక్షం జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని భావిస్తోంది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. రాత్రికి రాత్రి ఈ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకూ ఇన్‌ఛార్జీలను నియమించింది.
ఏపీలో అరకు (ఎస్టీ రిజర్వుడ్)- జగత శ్రీనివాస్, శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న, విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం, కొత్తూరి శ్రీనివాస్, అనకాపల్లి- సనపల అన్నాజీరావు, కాకినాడ- కేబీఆర్ నాయుడు, అమలాపురం (ఎస్సీ రిజర్వుడ్)- వెంకట శివప్రసాద్, రాజమండ్రి- ముశిని రామకృష్ణ.. నియమితులయ్యారు.
నరసాపురం- జెట్టి గురునాథరావు, ఏలూరు- కే బాపిరాజు, మచిలీపట్నం- కొరివి వినయ్ కుమార్, విజయవాడ- డాక్టర్ మురళీ మోహన్ రావు, గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్, నరసరావుపేట- వీ గురునాథం, బాపట్ల (ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం, ఒంగోలు- యూ వెంకట్రావు యాదవ్‌లను అపాయింట్ చేసింది.
నంద్యాల- బండి జకారియా, కర్నూలు- పీఎం కమలమ్మ, అనంతపురం- ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపురం- షేక్ సత్తార్, కడప- ఎన్ సుధాకర్ బాబు, నెల్లూరు- ఎం రాజేశ్వరరావు, తిరుపతి (ఎస్సీ)- షేక్ నజీర్ అహ్మద్, రాజంపేట- డాక్టర్ ఎన్ తులసీరెడ్డి, చిత్తూరు (ఎస్సీ- డీ రామ్ భూపాల్ రెడ్డి అపాయింట్ అయ్యారు.












Click it and Unblock the Notifications