మెదక్: సునీత X వ్యాపారవేత్త: దేవీప్రసాద్‌కి ఎమ్మెల్సీ
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. తెరాస అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సోనీ ట్రావెల్స్ యజమాని, వ్యాపార వేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్‌ల పేర్ల పరిశీలన అనంతరం సామాజిక వర్గాల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు.
నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు. దీంతో మంగళవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు. మెదక్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూదన్ మిస్ర్తీ ప్రకటించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ బుధవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మెదక్ పార్లమెంటు నియోజక వర్గంలో ఇప్పటి వరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మూడు నామినేషన్లు మంగళవారం దాఖలయ్యాయి.
టిఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని ఎన్జీవో సంఘాల నేతలు కోరినప్పటికీ సామాజిక వర్గాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. తనకు టికెట్ లభించక పోవడంతో దేవీప్రసాద్ అసంతృప్తికి గురయ్యారు. దేవిస్రాద్ సేవలు రాష్ట్రానికి అవసరమని కేసిఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే శాసన మండలి సభ్యులుగా దేవీప్రసాద్‌కు అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ తరఫున సునీతా లక్ష్మారెడ్డిని రంగంలో దించాలని ఆ పార్టీ నిర్ణయించుకొంది. అదే సమయంలో బిజెపి సైతం మెదక్ ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం ప్రధానపాత్ర వహించే విధంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి పరిస్థితిలో రెడ్డి సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెరాస వర్గాలు తెలిపాయి. రెడ్డి సామాజిక వర్గం, మహిళా కోణంలో ప్రచారం చేసి గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది.
అదే సమయంలో బిజెపి, తెదేపాలు ఏకమైన మెదక్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెరాస అభ్యర్థి ఖరారైన తరువాతనే బిజెపి అభ్యర్థిని ఖరారు చేయాలని బిజెపి ముందుగానే నిర్ణయించుకుంది. తెరాస, కాంగ్రెస్, బిజెపి ఈ మూడు పార్టీలూ మెదక్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సొంతంగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు సంసిద్ధంగా లేరు. బిజెపికి మద్దతివ్వాలని తెదేపా నిర్ణయించుకుంది.
ఉప ఎన్నికల్లో విజయం సాధించి మెదక్ సీటును నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని తెదేపా నేతలు ప్రకటించారు. తెదేపా, భాజపా కలిసికట్టుగా పని చేస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చని బిజెపి భావిస్తోంది. కలిసికట్టుగా ప్రచారం చేయడం ద్వారా మెదక్‌లో గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
ప్రత్యర్థులు రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులను పోటీలో నిలబెట్టి, తెరాస ఈ వర్గాన్ని చిన్నచూపు చూస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేయాలని భావించారని, దానిని దృష్టిలో పెట్టుకొనే తెరాస కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేయాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రజాసమితి తరఫున నల్లనాగుల వెంకటేశ్, గ్రామ స్వరాజ్యం పార్టీ తరఫున బీంకర్ బస్వాల్, ఇండిపెండెంట్‌గా కొట్టాడ జంగయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఒక నామినేషన్ దాఖలైంది.
కాగా, మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్షి సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించామనే బాధ ప్రజల్లో ఉందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టారని, మెదక్ ఎన్నికల్లోను తాను గెలుస్తానని చెప్పారు. తెరాస పైన ప్రజలు అపనమ్మకంతో ఉన్నారన్నారు. ఆమె బుధవారం బీఫారం తీసుకున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications