ఇంకా అడగొద్దా, ఓకే అంటే ప్రశ్నలు సంధిస్తా: పవన్‌కు కాంగ్రెస్ నేత ఝలక్

అమరావతి: మూడ్రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పవన్‌కు ఏ విషయంలోను స్పష్టత లేదని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని గుర్తు చేశారు. కానీ ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదనే సాకుతో ప్రశ్నించవద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. పవన్ అడగమంటే కొన్ని ప్రశ్నలు అడిగేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇదేం పద్ధతి!?

ఇదేం పద్ధతి!?

పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారని, కానీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేయడం ఏమిటని జీవీ రెడ్డి ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు అనుకూలంగా మారారని ఎద్దేవా చేశారు.

Recommended Video

    పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?
    ప్రతిసారి ప్రజల్లోకి వెళ్లాలనడం ఏమిటి?

    ప్రతిసారి ప్రజల్లోకి వెళ్లాలనడం ఏమిటి?

    జనసేన పార్టీకి రాజ్యాంగం ప్రకారం గుర్తింపు రాకపోయినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఇప్పటికే గుర్తింపు పొందిందని జీవీ రెడ్డి అన్నారు. మళ్లీ కొత్తగా ప్రజల్లోకి వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లయినా ప్రజల్లోకి వెళ్తానని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్టీ స్థాపించి ఇన్నేళ్లయినా ప్రజల్లోకి వెళ్తానని పదేపదే చెబుతున్నారని విమర్శించారు.

    విస్తృతస్థాయి పర్యటనలు

    విస్తృతస్థాయి పర్యటనలు

    పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీబిజీ అవుతున్నారు. 2019లో ఎన్నికలు ఉన్నందున ఆయన సినిమాలను పక్కన పెట్టేశారు. రాజకీయాల కోసం ఆయన సినిమాలు పక్కన పెట్టినట్లు స్వయంగా ఆయన కూడా చెప్పారు. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొంత సమయం తీసుకొని రెండేళ్లకు ఓసారి ఓ సినిమా చేస్తారని ఆయన సన్నిహితులు ఇటీవల చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు పవన్ బిజీగా ఉంటారని, ఏపీ, తెలంగాణల్లో విస్తృతంగా పర్యటిస్తారని చెబుతున్నారు.

    ఎన్నికల తర్వాతా డబ్బు అవసరం

    ఎన్నికల తర్వాతా డబ్బు అవసరం

    ఏఎం రత్నం, మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్‌తో తమ ప్రాజెక్టు కోసం వేచి చూస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల తర్వాత వరకు వారు వేచి చూడాల్సిందే అంటున్నారు. ఎన్నికల తర్వాత కూడా పార్టీ నడిపేందుకు డబ్బు అవసరం. అందుకోసం ఆయన సినిమాలు తీస్తారని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+