వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చేద్దాం?: కొత్త పార్టీపై సీమాంధ్ర కాంగ్ తర్జన భర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress leaders meet at Thota residence
రాజమండ్రి: రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోవడంతో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు పార్టీని వీడే విషయమై తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడగా మరికొందరు వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు నేతలు ఏం చేయాలో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కి తగ్గేలా కన్పించకపోవడంతో సీమాంధ్రలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతల తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మంగళవారం భేటీ అయ్యారు. మంత్రి తోట నర్సింహం నివాసంలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పళ్లంరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.

మాజీ మంత్రి విశ్వరూప్ లాంటి కొంతమంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారని, తాము అక్కడ ఇమడలేమని మరొక నేత, టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలోకి కూడా వెళ్లలేమని ఇంకో నేత ఆవేదన వ్యక్తం చేశారట.

కాంగ్రెస్‌లోనే పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్న వాదనా ఈ అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎపిఎన్జీవోలను కలుపుకొని సమైక్యాంధ్ర పేరుతోనే కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందనే అంశంపై నేతలు చర్చించారట.

కాగా, తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పళ్ళంరాజు స్పష్టం చేశారు. అన్నవరం సత్యదేవుడిని ఆయన సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర విషయంలో తనకు పార్టీ నిర్ణయంకన్నా ప్రజాభిష్టమే శిరోధార్యమన్నారు. అందుకే తన రాజీనామాను ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్, సోనియా గాంధీలకు అందజేశానని చెప్పారు. అయితే దాన్ని ఆమోదించాల్సి ఉందన్నారు.

తెలంగాణాపై ఆంటోని కమిటీ నివేదిక రాకుండానే క్యాబినెట్ నోట్ పెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జివోఎం కమిటీ రాష్ట్రంలో తిరిగి ప్రజాభిప్రాయాలు సేకరిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. విభజన వల్ల అధిష్టానానికి అనేక సమస్యలు ఎదురవుతాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశానన్నారు.

English summary
East Godavari district Congress leaders met at Minister Thota Narasimham residence on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X