జడ్పీ ఎన్నికలు: ఒకటి సైకిల్‌కు, రెండు హస్తానికి

రంగారెడ్డి జడ్పీ చైర్మన్ పదవికి టిడిపి నుంచి ప్రభాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అభ్యర్థి తేలకపోవడంతో కాంగ్రెసు, టిడిపి ఎన్నికకు గైర్హాజరు కావాలని అనుకుంటున్నాయి. దీంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. తెరాస నుంచి సునీతా మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు.
కాగా, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు టిడిపి సహకరిస్తోంది. శుక్రవారం ఇక్కడ టిడిపి అధినేత చంద్రబాబుతో పార్టీ తెలంగాణ నేతలు భేటీ అయి ఆమోదం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో తమకు మద్దతిచ్చే పార్టీకి మిగిలిన రెండు జిల్లాల్లో అండగా నిలవాలని, లేకపోతే మూడుచోట్లా తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించినట్లు టిడిపి తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకరరావు ధ్రువీకరించారు.
మరోవైపు కాంగ్రెస్ వర్గ విభేదాలను సానుకూలం చేసుకోవాలని తెరాస యోచిస్తోంది. మరోవైపు శుక్రవారం టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జానారెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రంగారెడ్డి విషయంలో మాజీమంత్రి చెన్నారెడ్డితో, మహబూబ్‌నగర్‌పై డీకే అరుణతో పొన్నాల, జానా ఫోన్‌లో మాట్లాడారు.












Click it and Unblock the Notifications