జగన్ మద్దతు కోసం జాతీయ పార్టీ రాయబారం..?

ఏపీలో ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మెజార్టీ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో జగన్ మద్దతు కోసం జాతీయ పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఎన్నికల ఫలితాలలో ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే, కచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ కీలకం అవుతారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి నుంచి వైసీపీకి రాయ‌బారాలు మొద‌లుపెట్టినట్టు తెలుస్తోంది.వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Congress party an ambassador for Jagan s support at the centre

బీజేపీ ఏపీలో టీడీపీతో కలవడంతో, తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారట.అయితే జగన్ మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా తమ మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారట. దీనిపై జాతీయ నాయకులు సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది.మాకు మ‌ద్ద‌తివ్వండి. మీకు ఏం చేయాల‌న్నా.. మేం అధికారంలోకి రాగానే చేసి పెడతాం'' అని జగన్‌కు కూటమి కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+