ఎన్నికల కోసం జగన్ 5వేల కోట్లు ఖర్చుచేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే: కాంగ్రెస్ సీనియర్ నేత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఏపీలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక హాట్ సీట్ల పైన పెద్దఎత్తున బెట్టింగులు కూడా కొనసాగుతున్నాయి.
ఏపీలో అధికారం మాదే .. అన్ని పార్టీలలోనూ ధీమా
ఈసారి అధికారం తమకే వస్తుందని టిడిపి కూటమి ధీమాతో ఉంటే, మళ్ళీ అధికారం వైసిపి హస్తగతం అవుతుందని, ఫ్యాన్ సునామీ సృష్టిస్తుందని వైసిపి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఎగ్జిట్ పోల్స్ పై ప్రస్తుతం నిషేధం ఉండడంతో ఏ పార్టీ గెలుస్తుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.

అధికారం కూటమిదే
ఈ క్రమంలో ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన సీనియర్ రాజకీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏపీ ఎన్నికల పైన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ వెల్లడించారు.
వైసీపీవి ఊహలు మాత్రమే
ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు.ఈ ఎన్నికల్లో గెలుస్తామని, వైసిపి నేతలు ఊహలలో ఉన్నారన్న చింత మోహన్ అధికారాన్ని చేపట్టేది టిడిపి కూటమినే అన్నారు.
వేల కోట్లు కుమ్మరించిన వైసీపీ.. కానీ ఓట్లన్నీ చంద్రబాబుకే
ఏపీ ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల నుంచి 5 వేల కోట్లు ఖర్చు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇంత డబ్బు ఖర్చుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లు చంద్రబాబుకు పడ్డాయని చింత మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని, గూడూరు వైసీపీ అభ్యర్థి రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
కేంద్రంలో గెలిచేది కాంగ్రెస్ నే
వైసీపీకి పోలీసులు అండగా నిలిచారని చింతా మోహన్ ఆరోపించారు. పోలీసులు దొంగలను పట్టుకోవాలి కానీ వాళ్లే దొంగలకి సహాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని , బీజేపీ 150సీట్లు కూడా దాటదని చింత మోహన్ చెప్పారు. ఇక ఏపీలో ఇప్పటికే కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications