కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం.. అందుకే విలీనం చేశా: చిరంజీవి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ నేత చిరంజీవి అన్నారు. సామాజిక న్యాయం కోసం తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని ఆయన తెలిపారు. శనివారం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చిరంజీవితోపాటు ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర నేతలు నివాళులర్పించారు.

విఫలమయ్యారు: బాబు పాలనపై గవర్నర్‌కు కాంగ్రెష్

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కెవిపి రామచంద్రరావు, కొండ్రు మురళీ, తదితర నేతలు గవర్నర్ నర్సింహన్‌ను కలిశారు.

చంద్రబాబు పాలనపై 12 పేజీల లేఖను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేశారు. చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అవినీతి మయం చేస్తున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షలతో బతుకుతున్నారని అన్నారు. రాజధాని కోసం రైతులు, ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Congress for social justice: Chiranjeevi

గవర్నర్ ఎదుట సంతకాలు చేసినా.. వాటికి దిక్కులేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లు కోత పెట్టిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బెల్టు షాపులు మూసివేస్తామన్న వేలాది సంఖ్యలో కొనసాగుతున్నాయని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలను తొలగించారని అన్నారు.

అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. 500మండలాల్లో కరువు పరిస్థితి నెలకొన్నాయని, రైతుల అల్లాడిపోతున్నారని అన్నారు. ఇప్పటికీ కరువు మండలాలు ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని అన్నారు. బిజెపి, టిడిపి ప్రభుత్వంలో ఏడేండ్ల తర్వాత ప్రజలు వలస బాట పడుతున్నారని అన్నారు.

ఒక్క అనంతపురం జిల్లాలోనే 50మంది ఆత్మహత్య రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రుణమాఫీపై చంద్రబాబు ప్రభుత్వం లక్ష షరతులు పెట్టిందని ఆరోపించారు. ఇంత నిర్ధయ గల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని రఘువీరారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+