ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాహుల్ ట్వీట్, కేవీపీకి రాజ్యసభలో ఊహించని మద్దతు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Rahul Gandhi Tweets Supporting AP MPs Protest in Parliament

  న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా రాజ్యసభలో వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుకు శుక్రవారం మద్దతు లభించింది. ఆయనకు టిడిపి నుంచి అనూహ్య స్పందన లభించింది.

  కేవీపీతో పాటు టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరులు కూడా వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. నలుగురు సభ్యులు వెల్లోకి రావడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

  తనకు జీరో అవర్, క్వశ్చన్ అవర్ సాగడమే ముఖ్యమని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. వారు ఆందోళన విరమించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఓసారి అలా, మరోసారి ఇలా: బాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, మోడీపై విమర్శలు

  ఈ తరహా నిరసనలను ప్రజలు చూడాలని తాను భావించడం లేదన్నారు. వారి వైపు కెమెరాలు తిప్పవద్దని ఆదేశించారు. ఇది పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధమని, తన సూచనలు పాటించాలన్నారు. లేదంటే వారిని సస్పెండ్ చేయడం లేదా సభ వాయిదా వేయడం మినహా ఏదీ లేదన్నారు.

  ఇదిలా ఉండకా, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏపీ టీడీపీ ఎంపీలకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు.

  ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న ఎంపీల డిమాండుకు కాంగ్రెస్ మద్దతిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. ఏపీ విభజన హామీలపై అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. న్యాయం చేయాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'The Congress Party supports the just demands of the people of Andhra Pradesh for special category status and speedy completion of the Polavaram project. It's time for all parties to unite on this issue and support this call for justice.' Rahul Gandhi tweet.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి