ఫలితాల ముందే వైసీపీకి ఢిల్లీ బంపరాఫర్ - తేల్చేసిన జగన్..!!

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ ముఖ్యనేతలకు మాత్రం ఫలితంపైన స్పష్టత వచ్చేసింది. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎంపీ సీట్లు 22 కంటే ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ,కాంగ్రెస్ సైతం ఏపీలో ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయని నివేదికల పైన అధ్యయనం చేసారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా వైసీపీ మద్దతు కోసం కీలక రాయబారం జరిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ సంప్రదింపులు
ఏపీలో అధికారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2019లో వైసీపీ గెలిచిన తరువాత ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచింది. పలు బిల్లుల విషయంలో మద్దతు ప్రకటించింది. కేంద్రం నుంచి జగన్ కు అనేక అంశాల్లో సహకారం అందింది. అయితే, అనూహ్యంగా ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఏపీలోని బీజేపీ ముఖ్యులు సైతం పార్టీ నాయకత్వానికి ఏపీలో పోలింగ్ సరళి పైన నివేదికలు ఇచ్చారు.

Congress Woos Jagan Key discussions on Central Support YSRCP chief looks at whom Modi or Sonia

మారుతున్న లెక్కలు
అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు...ఎంపీ స్థానాలు ఎవరికి ఎన్ని దక్కుతాయనే లెక్కలతో అంచనాకు వచ్చారు. కేంద్రంలో ఈ సారి ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, లోక్ సభ సీట్ల కంటే బీజేపీకి రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు అవసరం. ఇప్పటి వరకు వైసీపీ రాజ్యసభలో సహకారం అందింది. ఇప్పుడు టీడీపీతో బీజేపీ కలవటంతో ఇక జగన్ నుంచి ఆ సహకారం అందుతుందా లేదా అనేది సందేహంగా మారింది. అదే సమయంలో కేంద్రంలో గట్టి పోటీ ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్-ఇండియా కూటమి నేతల్లో ముఖ్య నాయకుడు తాజాగా వైసీపీలోని కీలక నేతతో టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ ఏపీలో టీడీపీతో కలవటంతో..తమతో జత చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం.

Congress Woos Jagan Key discussions on Central Support YSRCP chief looks at whom Modi or Sonia

జగన్ మద్దతెవరికి
అయితే, జగన్ మాత్రం తన మద్దతు విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా..తమ మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదాపైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా..ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నంత వరకు బీజేపీకి జగన్ మద్దతు సందేహమే. రాజ్యసభలో మాత్రమే జగన్ మద్దతు బీజేపీకి అసవరం అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ - ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేందుకు జగన్ సిద్దంగా లేరనేది సుస్పష్టం. తటస్థంగా ఉంటూనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల తరువాత ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+