అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లు కాదు, పదేళ్లే పడుతుంది: చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందని అంచనా వేసినప్పటికీ పదేళ్లలోనే పూర్తవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. నిర్మాణానికి ప్రజలకు సహకరిస్తే పదేళ్లలో పూర్తవుతుందని ఆయన అన్నారు.
బెంజ్ సర్కిల్ సమీపంలో కొత్తగా నిర్మించిన ట్రెండ్‌సెట్ మాల్‌లోని క్యాపిటల్ సినిమాస్ మల్టీప్లెక్స్‌నను సోమవారం ప్రారంభించిన ఆయన ఆ విషయం చెప్పారు. మల్టీప్లెక్స్‌లతో పాటు రాజధాని నగరంలో సిక్స్ స్టార్ హోటళ్లు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హైదరాబాదులో చిన్నపాటి షాపింగ్ స్మాల్స్ ఉండేవని, ఆ తర్వాత భారీ షాపింగ్ మాల్స్ వచ్చాయని, దాంతో హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతోందని ఆయన అన్నారు.

విజయవాడ చాలా కార్యకలాపాలకు కేంద్రమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తన యవ్వనదశను గుర్తు చేసుకుంటూ సినిమాలు చూడడానికి తాను విజయవాడ వస్తుండేవాడినని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేయడంలో విజయవాడ ప్రజలు సాయపడ్డారని ఆయన చెప్పారు.
మల్టీప్లెక్స్‌ల్లో వరల్డ్ క్లాస్ సినిమాలు చూడడానికి అవకాశం ఉంటుందని నటుడు వెంకటేష్ అన్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాల ప్రదర్శన అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని నిర్మాత సురేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications