రాజధాని అమరావతి నిర్మాణంపై అదిరిపోయే శుభవార్త!

రాజధాని అమరావతిపైన మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరుకు పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని వేగంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులు ఫిబ్రవరి నెల నుంచి వేగం పుంజుకుంటాయని ఆయన వెల్లడించారు.

మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం
గత ప్రభుత్వ నిర్వాకంతో ఎదురైన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటూ అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటివరకు రాజధాని అమరావతి నిర్మాణంలో 40 పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు.

Construction of capital Amaravati at jet speed from february Minister narayana announces good news

రాజధానిని ప్రపంచంలో ఒకటిగా గుర్తించేలా ప్లాన్
రాజధానిని ప్రపంచంలో ఒకటిగా చేయాలన్న ఉద్దేశంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ పోస్టర్ చేత చేయించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరాచక పాలన సాగిందని వైసీపీ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజధానిని నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పైన కక్షతో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాలను ఆపివేసిందని నారాయణ ఆరోపించారు.

అసెంబ్లీని మల్టీ పర్పస్ లో టూరిస్ట్ స్పాట్ గా మార్చేలా డిజైన్లు
2019 ముందే రాజధానిలో అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం మొత్తం 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించామని వాటన్నింటిని గత వైసిపి ప్రభుత్వం మధ్యలోనే ఆపివేసిందని అన్నారు మంత్రి నారాయణ. ఇక రాజధానిలో అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి అసెంబ్లీ నిర్వహించినప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్లను రూపొందించామని మంత్రి నారాయణ వెల్లడించారు.

రాష్ట్ర స్థాయి అధికారులు ఒకేచోట ఉండేలా అడ్మినిస్ట్రేటివ్ టవర్లు
విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్లైన్లు ఏవి బయటకు కనబడకుండా అండర్ గ్రౌండ్ లో ఉండేలాగా రూపొందించమని నారాయణ పేర్కొన్నారు. ఇక రాష్ట్రస్థాయి అధికారులు ఒకే చోట ఉండే విధంగా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. న్యాయపరమైన సమస్యలతో అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని ఇక వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులలో దూకుడు కొనసాగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+