Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి మాస్టర్ ప్లాన్ లో బిగ్ ట్విస్ట్ - మార్పు తప్పదా..!!

ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఖాయం కావటంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ అమలులో కొత్త సమస్య ఎదురైంది. మాస్టర్‌ప్లానులో పేర్కొన్న రోడ్లకు చాలాచోట్ల అండర్‌పాసులు వదలకుండానే ఈ రోడ్డును నిర్మించేశారు. దీంతో, ఇప్పుడు కన్సెల్టెంట్లు కొత్త సూచనలు చేస్తున్నారు.

రాజధాని నగరం అమరావతి మాస్టర్‌ప్లాను అమలు విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది. కొత్తగా చిన అవుటపల్లి నుండి చినకాకాని వరకూ నిర్మించిన విజయవాడ పశ్చిమ జాతీయ రహదారి ఈ సమస్యకు కారణంగా మారింది. రాజధాని మాస్టర్‌ప్లానులో పేర్కొన్న రోడ్లకు చాలాచోట్ల అండర్‌పాసులు వదలకుండానే ఈ రోడ్డును నిర్మించేశారు. దీంతో అమరావతి మాస్టర్‌ప్లాను రెండు ముక్కలుగా మారింది. జాతీయ రహదారికి తూర్పు,పడవర ప్లాన్లుగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరలా కొత్త ప్లాను రూపొందించాల్సిఉందన్న అభిప్రాయాన్ని సిఆర్‌డిఎ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Consultants suggests changes in Amaravati Master plan due to NHAI constructions

అమరావతి నిర్మాణానికి ఒకటీ రెండు నెలల్లో నిధులు వస్తాయని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్సల్టెంట్లు నివేదికలు తయారు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమరావతిలో రోడ్డు గ్రిడ్‌కు సంబంధించి తొలుత ఇచ్చిన మాస్టర్‌ప్లానులో స్వల్ప మార్పులు చేసి 2017 మార్చిలో మరో ప్లాను విడుదల చేశారు. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం తొలుత ఇచ్చిన మ్యాపే ప్రచారం జరుగుతోంది. తరువాత ఇచ్చిన మ్యాపు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. దీనిలో గతంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి వెంకటపాలెం, కృష్ణాయపాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు గ్రామాల పక్కగా వెళ్లి చినకాకానివద్ద జాతీయ రహదారిలో కలిసే విధంగా ప్రతిపాదించారు. విజయవాడ పశ్చిమదిశలో నిర్మించే జాతీయ రహదారికి మాస్టర్‌ ప్లానులో పేర్కొన్న ఎన్‌6 నెంబరు రోడ్డును కలిపారు. అంటే మాస్టర్‌ప్లానులో చూపించిన ఎన్‌6 ఆర్డిరియల్‌ రోడ్డును జాతీయ రహదారిగా మార్చారు. దీనిలో సీడ్‌ యాక్సెస్‌రోడ్డుతో పాటు వెంకటపాలెం చలివేందం(పాత మంగళగిరి-తుళ్లూరురోడ్డు జంక్షన్‌)- నిడమర్రు సమీపంలో అతిపెద్ద జంక్షన్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ క్లోవ్‌గానీ, ట్రంపెట్‌ తరహాలో జంక్షన్లు వేయాలని, ఇది రాజధాని అమరావతి కనెక్టివిటీకి అత్యంత విలువైన కేంద్రంగా మారుతుందని అంచనా వేశారు. అయితే, ఆచరణ మాత్రం దానికి భిన్నంగా జరిగింది. జాతీయ రహదారుల విభాగం రూపొందించిన ప్లాను ప్రకారం పనులు పూర్తి చేశారు.

జంక్షన్లకు బదులు అండర్‌పాసులు
రెండోసారి రూపొందించిన ప్లాన్‌ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమరావతికి వెళ్లే జాతీయ రహదారికి మొత్తం 11 రోడ్లు అనుసంధానం కావాల్సి ఉంది. నాలుగు చోట్ల ఫీడర్‌ యాక్సెస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్మించిన రోడ్డులో జంక్షన్‌ నిర్మాణానికి వీలుగా ఎక్కడా అవకాశం కల్పించలేదు. జంక్షన్లు నిర్మించాలనుకున్న సీడ్‌యాక్సెస్‌రోడ్డు, చలివేంద్రం, నిడమర్రు, చినకాకాని హారుల్యాండ్‌ రోడ్డువద్ద అండర్‌పాస్‌ సదుపాయం కల్పించి రోడ్డును పూర్తి చేశారు. అలాగే 11 చోట్ల మేజర్‌ ఆర్టిరియల్‌ రోడ్లు కొత్త జాతీయ రహదారిని క్రాస్‌ చేస్తున్నా వాటికి ఎక్కడా కూడా అండర్‌పాస్‌లు అవకాశం కల్పించలేదు. అది తమ ప్లానులో లేదని, అమరావతి రాజధాని ప్లానుకు, జాతీయ రహదారుల విభాగం ప్లానుకు సంబంధం లేదని ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకే కాంట్రాక్టరు పనులు పూర్తిచేశారనీ తెలిపారు.

కొండవీటివాగు మాయం
వెంకటపాలెం చలివేంద్రం మధ్యలో కొండవీటివాగును జాతీయ రహదారి దాటుతుంది. అక్కడ తూములుగానీ, నీరు వెళ్లేందుకువీలుగా మార్గంగానీ ఏర్పాటు చేయాల్సి ఉండగా అటువంటి దేమీ చేయకుండా వాగును పూడ్చివేశారు. దీంతో అక్కడ కొండవీటివాగు మాయం అయింది. ఇటీవల వరదలు వచ్చిన సమయంలో నీటి ప్రవాహం నిలిచిపోయిందని వెంటనే తూములు ఏర్పాటు చేయాలని కోరగా అప్పటి కప్పుడు తూములు తెచ్చి ఒక వరుస ఏర్పాటు చేసి తాత్కాలికంగా నీటి ప్రవాహం కొనసాగేలా చూశారు. ప్రస్తుతం రెండు వరుసల తూములు నిర్మించారు. అలాగే ప్రస్తుతం వెంకటపాలెం నుండి చలివేంద్రం వరకూ వెళ్లే రోడ్డును కూడా మూసేస్తున్నారు. అక్కడ ఫీడర్‌ ఏర్పాటు చేస్తున్నారు.

కేంద్రం అనుమతి తప్పనిసరి
మాస్టర్‌ప్లానులో పేర్కొన్న విధంగా ప్రస్తుత జాతీయ రహదారి నిర్మాణం లేకపోవడంతో జాతీయ రహదారిపై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలా, లేక అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలా అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ రెండిటిలో ఏది చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. పైగా ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమస్య మరింత తీవ్రమైందని అమరావతి రైతులు చెబుతున్నారు. అలాగే ప్లాను రూపకల్పన, అమలుపై గతంలో ప్లాను రూపొందించిన సింగపూర్‌ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+