Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాదాల చిట్టా: ఎపి, తెలంగాణ డిష్యూం డిష్యూం

హైదరాబాద్: అనుకున్నట్లే జరుగుతున్నట్లుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేయాలనే ఆలోచన వివాదాన్ని రేపింది.

ఇంతకు ముందు పోలవరం ఆర్డినెన్స్ రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించింది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు లోకసభలో ఆందోళనకు కూడా దిగారు.

Controversies begin between AP and Telangana

తాజాగా, పిపిఎల రద్దు వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. పిపిఎల రద్దుకు ఈఎస్‌కు రాసిన లేఖను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఒకటి చేస్తే తాము రెండు చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఆ రాష్ట్రానికే దక్కాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ పిపిఎలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించికుంది. ఈ మేరకు ఈఆర్‌సీకి ఏపీ జెన్‌కో లేఖ కూడా రాసింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు విద్యుత్ లభిస్తుంది. తెలంగాణ మాత్రం 615 మెగా వాట్ల విద్యుత్‌ను కోల్పోతుంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పొన్నా లక్ష్మయ్య తప్పుపట్టారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కలుస్తారని అంటున్నారు.

ఇదిలావుంటే, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్ వ్యవహారం కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. తెలంగాణలోని కళాశాలల్లో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ రాష్ట్ర విద్యార్థులకు తామే ఫీజు రీయంబర్స్‌మెంట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. స్థానికత అంటే ఏమిటో స్పష్టత ఇవ్వాలని మరో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు కోరారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిగానే పిపిఎల రద్దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకున్నట్లు చెబుతున్నారు. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆ రాష్ట్రానికే చెందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాని గురించి ప్రశ్నిస్తే తెలంగాణ విద్యాసంస్థల్లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎందుకు చేయరని అడగాలని అనుకుంటోందని అంటున్నారు. ఏమైనా, ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+