తిరుమల లడ్డూ పై వివాదం, ఎవరిదీ పాపం- ఏం జరిగింది..!!

తిరుమల లడ్డూ పై వివాదం కొనసాగుతోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ ఛైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా లాబ్ రిపోర్టలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే, అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది. ఈ అపచారానికి బాధ్యులెవరు.

లడ్డూ వివాదం
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంరతకర పదార్ధాలు ఉన్నాయంటూ లాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యత పైన విమర్శలు వచ్చాయి. ల్లో మునుపటి రుచి గానీ, సువాసన గానీ, నాణ్యత గానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్‌ దాస్‌ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలిసింది.

Controversy continues over the alleged use of animal fat in Tirupati laddu

నెయ్యి సరఫరాలో మార్పు
దీన్ని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్‌కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో.. తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందినీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా లాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం వెంకట్రమణారెడ్డి బహిర్గతం చేసారు.

బాధ్యులెవరు
దేశంలో గుజరాత్‌ ఆనంద్‌ డెయిరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్ఠలున్న సంస్థ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌. ఈ ఫెడరేషన్‌ నందినీ బ్రాండ్‌ పేరిట నెయ్యిని సుదీర్ఘ కాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్‌ సరఫరా చేసే నెయ్యి నాణ్యతాపరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎ్‌ఫయే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నిందినీ నెయ్యి సరఫరాను నిలిపివేశారు. కేఎంఎఫ్‌ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. మరి..ఈ అపచారం పై విచారణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి బాధ్యులు ఎవరనేది తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+