వర్మ కడప వెబ్ సిరీస్‌పై దుమారం: జగన్‌కు వ్యతిరేకంగానా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రామ్ గోపాల్ వర్మ తీయనున్న కడప వెబ్ సిరీస్ రాయలసీమలో అగ్గి రాజేస్తోంది. విడుదలకు ముందే అది వివాదంగా మారింది. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో తీసిన రక్తచరిత్ర, కమ్మ-కాపుకులాల అధిపత్య నేపథ్యంగా తీసిన బెజవాడ సినిమాల కోవలోనే ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు.

  'కడప' టైటిల్ సాంగ్.. చావు కొడకా..!

  రెడ్డి సామాజిక వర్గాన్ని దోషిగా చూపించేందుకు వర్మ ఈ సినిమాలో ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్మ తాజాగా విడుదల చేసిన టీజర్, ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.

  ఫ్యాక్షనమ్మ వెలిసింది సీమలో...

  ఫ్యాక్షనమ్మ వెలిసింది సీమలో...

  ఫ్యాక్షనమ్మ వెలసింది సీమలో, ఆ అమ్మ గుడి రాయలసీమయితే దానికి గర్భగుడి కడప, ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర'అంటూ తాజాగా విడుదల చేసిన టీజర్‌తోనూ, వర్మ చేసిన వ్యాఖ్యలతోనూ దుమారం రేగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

  ఇలా చేస్తూ వర్మ

  ఇలా చేస్తూ వర్మ

  గతంలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలు, వాటికి రెడ్డి వర్గాన్ని జత చేస్తూ వర్మ ఈ వెబ్ సిరీస్‌ తీయాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇందులో రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి పాత్రలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీంతో ఈ సినిమాను వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎక్కుపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  ఆ పాత్రలు కాదని చెప్పినా...

  ఆ పాత్రలు కాదని చెప్పినా...

  ఆ రెండు పాత్రలు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డివి కాదని చెప్పినా కూడా ఎవరూ నమ్మడం లేదు. దానికితోడు రెడ్లను రెడ్లే హత్య చేసుకున్నారనే కులం రంగును కూడా ఆయన పులిమారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమ్మవాళ్లను కమ్మవాళ్లు, కాపు వాళ్లను కాపు వాళ్లు ఎక్కడా చంపుకోలేదని, కానీ కడపలో రెడ్లను రెడ్లే చంపేసుకుంటున్నారని వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. (

  ఆ పాటలు చూసిన తర్వాత..

  ఆ పాటలు చూసిన తర్వాత..

  సిరాశ్రీ సాహిత్యం, రవిశంకర్ సంగీతంతో స్వరాజ్‌హన్స్ పాడిన కడప వెబ్‌సిరీస్ టీజర్ లిరికల్ వీడియో సాంగ్‌లో చూపిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి వర్మపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.అనంతపురంలో రాయలసీమ విమోచన సమితి నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వర్మకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టి ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో పిల్ వేస్తామని చెప్పారు.

  సత్తాచూపుతామంటూ...

  సత్తాచూపుతామంటూ...

  ఎక్కడో ముంబైకి వెళ్లి దాక్కున్న వర్మ తీస్తున్న కడప వెబ్ సిరీస్‌లో అవాస్తవాలుంటే తమ సత్తా చూపిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి హెచ్చరించారు. వర్మకు దమ్ముంటే కడప చరిత్రపై తమతో చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే, అలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని, రాయలసీమ శరీరాన్ని నగ్నంగా బట్టలిప్పి చూపిస్తానని వర్మ చెప్పారు. దాంతో వివాదం మరింతగా ముదిరింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rayalaseema people are expressing angry at Ram gopal Varma n Kadapa Web series.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి