నేనెందుకు బతకాలి: కానిస్టేబుల్ నాగరాజు భార్య, రోదనలు (పిక్చర్స్)

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురంలో ఎన్‌కౌంటర్లో మృతి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. భర్త మృతి వార్త విన్న భార్య సంజన, తల్లిదండ్రులు లక్ష్మమ్మ, శ్రీమన్నారాయణలు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఇక నేనెందుకు బతకాలి అంటూ భార్య మృతదేహంపై పడి రోదించారు. అది అందర్నీ కంటతడి పెట్టించింది. నాగరాజును తాము శుక్రవారం రాత్రి చూశామని చెప్పారు.

శుక్రవారం రాత్రి సంజనను తమ ఇంటి వద్ద వదిలి నాగరాజు విధులకు వెళ్లాడని, ఉదయం టీవీ చూస్తుండగా కాల్పుల్లో నాగరాజు మృతి చెందినట్లుగా చూసి కంగారుపడ్డామని, పోలీసులు ఫోన్ చేయడంతో విషయం తెలిసి కుప్పకూలిపోయామని తల్లిదండ్రులు, భార్య రోదిస్తూ చెప్పారు.

నాగరాజు మృతదేహం వద్ద గుత్తా

నాగరాజు మృతదేహం వద్ద గుత్తా

తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట కాల్పుల కారకుల కథను పోలీసులు ముగించారు. వారిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అస్లాం అయూబ్‌, జకీర్‌గా గుర్తించారు. వీరు ఉత్తుత్తి దొంగలు కాదని, ఉగ్రవాదులే అని ప్రాథమికంగా నిర్ధారించారు.

నాగరాజు మృతదేహం వద్ద గుత్తా

నాగరాజు మృతదేహం వద్ద గుత్తా

సూర్యాపేటలో ఒక కానిస్టేబుల్‌ను, ఒక హోంగార్డును బలి తీసుకున్న వైనాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగమంతా దుండగుల వేటలో నిమగ్నమైంది. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్వయంగా సూర్యాపేటలోనే మకాం వేశారు. కాల్పులు జరిపిన దుండగులు జిల్లా సరిహద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దుండగుల వద్ద కార్బైన్‌ గన్‌తోపాటు మరిన్ని ఆయుధాలు ఉండటం, దుస్తులకు రక్తపు మరకలు అంటడంతో వారు జనం మధ్యకు రాలేరని, సోదాల నేపథ్యంలో బస్సుల వంటి వాహనాలూ ఎక్కలేరని అంచనాకు వచ్చారు.

నాగరాజు

నాగరాజు

సూర్యాపేట బస్టాండులో కాల్పులు జరిపిన అనంతరం దుండగులు రకరకాల దారులు పట్టారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లి గుట్టల్లోకి వచ్చారు. ఒక రోజంతా అక్కడే మకాం వేశారు. గుట్టల సమీపంలోనే దర్గా ఉంది. శుక్రవారం రాత్రి అక్కడే నిద్ర చేస్తారు. దుండగులు కూడా అక్కడికి వచ్చే అవకాశముందని పోలీసులు అనుమానించారు. ఎస్పీ స్వయంగా అర్వపల్లి పీఎస్‌లో మకాం వేశారు.

కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు

కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు

శనివారం తెల్లవారగానే మెల్లగా బయట పడ్డారు. అర్వపల్లి నుంచి సీతారాంపురం గ్రామంలోని శ్రీరాంసాగర్‌ కాల్వకట్ట వెంట నడవడం మొదలుపెట్టారు. వీరిని భూమయ్య అనే స్థానికుడు గమనించారు. ఆ ప్రాంతానికి కొత్తవారు కావడం, హిందీలో మాట్లాడుతుండటంతో అనుమానించారు. నేరుగా తుంగతుర్తి సీఐ గంగారాంకు సమాచారం అందించారు. దీంతో ఆయన హోంగార్డును పంపి విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.

కుటుంబ సభ్యుల రోదన

కుటుంబ సభ్యుల రోదన

మోత్కూరు, రామన్నపేట, గుండాల, ఆత్మకూరు (ఎం) పోలీసులు బృందాల వారీగా రంగంలోకి దిగారు. దుండగులు చిర్రగూడూరు నుంచి వెళ్తుండగా స్థానికులు గుర్తించారు. ఈ సమయంలో ఆ ఇద్దరు బిక్కేరు వాగు వద్దకు వెళ్లి దుస్తులు మార్చుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిపైనా దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు తప్పించుకున్నారు. దుండగులు అక్కడ ఉపేందర్‌ అనే వ్యక్తికి చెందిన ప్యాషన్‌ ప్రో బైక్‌ తాళం తీసి జానకీపురం వైపు వెళ్లారు.

సూర్యాపేట కాల్పులు

సూర్యాపేట కాల్పులు

దండగులు ఒకటి రెండుసార్లు తప్పించుకున్నారు. ఆత్మకూరు(ఎం) పోలీసుల వాహనం అక్కడికి చేరుకుంది. పోలీసుల వాహనాన్ని చూసిన దుండగులు కాల్పులు జరిపారు. నడుపుతున్న కానిస్టేబుల్‌ నాగరాజు తలలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. ఆయన మృతి చెందారు. ముందు భాగంలో కూర్చున్న ఎస్‌ఐ సిద్ధయ్య వాహనంలో నుంచే కాల్పులు జరిపారు. దుండగులు సైతం ఆయనను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.

నాయిని నివాళి

నాయిని నివాళి

కాల్పుల్లో ఎస్సై సిద్ధయ్య తీవ్రంగా గాయపడి, నిస్సహాయంగా పడిపోయారు. వెనుక సీటులో శివ, మధు, శ్రీనివాస్‌ అనే కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆత్మరక్షణ కోసం సీట్ల మధ్యలో దాక్కున్నారు. దుండగులు బైక్‌ దిగి నేరుగా పోలీసుల వాహనం వద్దకు వచ్చారు. ఆయుధాలు ఇవ్వమని బెదిరించారు. అంతలోనే రామన్నపేట సీఐ బాలగంగి రెడ్డి వాహనం అక్కడకు చేరుకుంది. దీంతో దుండగులు అటువైపు దృష్టి సారించారు. సీఐ వాహనం దిగగానే దుండగులు ఆయనపైనా కాల్పులు జరిపారు. అదే సమయంలో సీఐ ఎదురు కాల్పులు జరిపారు.

సూర్యాపేట కాల్పులు

సూర్యాపేట కాల్పులు

ఈ లోపు ఆత్మకూరు పోలీసుల వాహనంలో ఉన్న కానిస్టేబుళ్లు ఒక్కసారిగా వాహనం డోర్‌ తీసి గట్టిగా నెట్టారు. దానికి సమీపంలోనే ఉన్న దుండగులు కింద పడ్డారు. ఇదే అదనుగా మధు అనే కానిస్టేబుల్‌ ఒక్క ఉదుటున జీపులోనుంచి దూకి దుండగుల మీద పడ్డాడు. సీఐ బాలగంగిరెడ్డి, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఆ రాక్షసుల నుంచి సూర్యాపేటలో అపహరించిన కార్బైన్‌ను, రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+