వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణా స్కూల్స్ లో కరోనా పంజా .. నెల్లూరు స్కూల్ లో 19 కేసులు, తెలంగాణా స్కూల్స్ లో ఇలా !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ని పాఠశాలలను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీన పాఠశాలను తెరిచిన నాటినుండి స్కూళ్లలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీన స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. మూడు రోజులు గడవక ముందే తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లోనూ కరోనా కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తుంది.

ఏపీలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ ; తాజాగా 1186 కేసులు, 10 మరణాలు, ఆ జిల్లాలోనే కరోనా ఉధృతిఏపీలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ ; తాజాగా 1186 కేసులు, 10 మరణాలు, ఆ జిల్లాలోనే కరోనా ఉధృతి

ఏపీ స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీ స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యికి పైగా నిత్యం కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. దేశంలోనే ఏపీ రోజువారీ కేసుల నమోదులో టాప్ ఫైవ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. అయినప్పటికీ విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా స్కూల్స్ ని ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక స్కూల్స్ ప్రారంభమైన నాటి నుండి నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి తీరు ఏపీలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు చిన్నారులను స్కూల్స్ కు పంపాలంటే భయపడుతున్నారు. స్కూల్స్ నిర్వాహకులకు కూడా ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది .

నెల్లూరు జిల్లాలో గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా కేసులు

నెల్లూరు జిల్లాలో గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లాలతోపాటు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు లోని యానాదుల గురుకుల కళాశాల, పాఠశాలలో ఒకేరోజు 19 మంది విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. రెండు రోజుల క్రితమే ఈ గురుకులంలో ఏడుగురు విద్యార్థులతో పాటు ఒక టీచర్ కు కూడా కరోనా సోకింది. తాజాగా మరో 19 కేసులు నమోదు కావడంతో అధికారులు గురుకులాన్ని సందర్శించారు . పాఠశాల, కళాశాలలలో ఉన్న మిగతా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

Recommended Video

స్కూళ్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటున్న తల్లిదండ్రులు || Oneindia Telugu
తెలంగాణా స్కూల్స్ లోనూ కరోనా పంజా

తెలంగాణా స్కూల్స్ లోనూ కరోనా పంజా

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్న తీరు అటు అధికారులకే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే మనుబోలు మండలంలోని గొట్లపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కూడా ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది .

నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కేసులు

నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కేసులు

పట్టుమని మూడు రోజులైనా కాకముందే తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్ళలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తాళ్ల రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో నిన్న 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక విద్యార్థికి, ఒక స్కూల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కూడా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా స్కూల్ టీచర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె పాఠాలు చెప్పిన క్లాసు విద్యార్థులందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఏటూరు నాగారంలోనూ ముగ్గురు టీచర్లకు కరోనా

ఏటూరు నాగారంలోనూ ముగ్గురు టీచర్లకు కరోనా

ఇదిలా ఉంటే ఏటూరునాగారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో కూడా ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోని మిర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కరోనా నిర్ధారణ అయింది. ఇక స్కూళ్ళలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల లోని ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్ళీ స్కూల్స్ కొనసాగిస్తారా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Corona is creating a stir in schools in the states of Andhra Pradesh and Telangana. Corona epidemic is not leaving schools in Telugu states. Corona cases have been registered in schools in the state of Andhra Pradesh since the school reopened on August 16. Schools started on September 1 in the state of Telangana. It is a matter of concern that corona cases are being registered in schools in Telangana three days before the deadline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X