కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా కల్లోలం: తాజాగా 12,561 కొత్తకేసులు; 12మరణాలు, అత్యధిక కేసులు ఆ జిల్లాలోనే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసుల వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో నిత్యం 10 వేలకు మించి కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళనగా మారింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,635 కరోనా శాంపిల్స్ ను పరీక్ష చెయ్యగా 12,561మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తుంది. మునుపటి రోజుతో పోలిస్తే కాస్త కరోనా కేసులు తగ్గినట్టు కనిపిస్తుంది. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 8,742మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా నేటి వరకు రాష్ట్రంలో 3,23,65,775 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.

 కరోనాతో ఏపీలో గత 24 గంటల్లో 12 మంది మృతి

కరోనాతో ఏపీలో గత 24 గంటల్లో 12 మంది మృతి

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, విజయనగరం , పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 14, 591 కి చేరుకుంది. ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా రోజువారీ కేసుల వివరాల్లోకి వెళితే

జిల్లాల వారీగా కరోనా రోజువారీ కేసుల లెక్క ఇదే

జిల్లాల వారీగా కరోనా రోజువారీ కేసుల లెక్క ఇదే

రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో 853 కేసులు, చిత్తూరు జిల్లాలో 423 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1067 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో 1625 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 1215 కేసులు, కృష్ణా జిల్లాలో 1056 కేసులు, కర్నూలు జిల్లాలో 1710, నెల్లూరు జిల్లాలో 1009 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 869 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 340 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1211 కేసులు, విజయనగరం జిల్లాలో 489 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 694 కేసులు నమోదయ్యాయి.

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300

రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాగా తాజాగా కర్నూలు జిల్లా నిలువగా, అతి తక్కువ కరోన కేసులతో శ్రీకాకుళం జిల్లా కేసులు నమోదులో చివరిలో ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,45,713 పాజిటివ్ కేసు లకు గాను 21,17,822 మంది డిశ్చార్జ్ కాగా 14,591 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,300 గా ఉంది. కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా రాష్ట్రంలో ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది.రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2117822కి చేరింది

సామాజిక వ్యాప్తి దశలో కరోనా.. అలెర్ట్

సామాజిక వ్యాప్తి దశలో కరోనా.. అలెర్ట్

కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నప్పటికీ రాష్ట్రంలో కేసుల జోరు మాత్రం కొనసాగుతుంది.కరోనా థర్డ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపద్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసులు పెరుగుదల ప్రధానంగా కనిపిస్తుంది. ఒక పక్క చలితీవ్రత పెరగటం, మరో పక్క కరోనా పరిస్థితుల నేపధ్యంలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే ఇంత పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నట్లుగా, ప్రస్తుతం ఎక్కడ చూసినా సామాజిక వ్యాప్తి దశలో కరోనా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

English summary
Corona cases rise continues in AP. It is a matter of concern that 12,561 new cases have been registered recently. 12 deaths in last 24 hours. highest cases reported in kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X