ఏపీ స్కూల్స్ లో కరోనా భయం .. బొబ్బిలి మున్సిపల్ స్కూల్ లో 10 మంది విద్యార్థులకు కరోనా, తాజా పరిస్థితి ఇదే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించడంతో మళ్లీ ఏపీలో స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ లో కరోనా కేసులు బయటపడుతున్న తీరు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలలో నిత్యం కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూడా కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదిమంది నాలుగవ తరగతి విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఎంఈఓ లక్ష్మణ రావు తెలిపారు . పాఠశాలలో మొత్తం 160 మంది విద్యార్థులు ఉన్నారని, ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఎంఈఓ ప్రస్తుతం 10 మంది విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడ్డారని వెల్లడించారు. ఇక స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో, మిగతా విద్యార్థులకు, మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

వారం రోజులపాటు స్కూల్ కు సెలవు కోరిన ఎంఈఓ
వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరినట్లుగా ఎంఈవో చెప్పారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయని, వారందరికీ వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12 కు చేరుకుంది. పివిఆర్ బాలికల హై స్కూల్ లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, ఒక ఎనిమిదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ప్రకాశం స్కూల్స్ లోనూ కరోనా కలకలం
అంతేకాదు ఒంగోలు మున్సిపల్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి . విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, విద్యార్థులు, తల్లిదండ్రులు కరోనా వ్యాప్తి పై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈసారి చిన్నారులకే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్న క్రమంలో భయపడుతున్నారు . పాఠశాలల్లో కరోనా నిబంధనలను పాటించాలని, ముందస్తుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికే మూతపడిన స్కూల్స్ ఇవే
ఇప్పటికే కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెద్ద పాలపర్రు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు పాఠశాలను మూసివేశారు. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపు గున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసి కండ్రిగలో కూడా విద్యార్థులకు కరోనా సోకడంతో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా స్కూల్ ను మూసివేశారు. మరోపక్క ప్రకాశం జిల్లాలోనూ కరోనా కేసులు పెరుగుతున్న పాఠశాలలను మూసివేస్తున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలో తాజా పరిస్థితులు అటు విద్యార్థులకు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం స్కూల్స్ లో నమోదవుతున్న కరోనా కేసులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు












Click it and Unblock the Notifications