చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా డెంజల్ బెల్.. ఒక్కరోజులో 10,057 కొత్త కేసులు.. 8 మంది మృతి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రెట్టింపు అవుతోంది. గడిచిన 24 గంటల్లో 10వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 44,935కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,222 మంది కరోనా నుంచి కోలుకోగా 8 మంది మరణించారు. వైర‌స్ బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 కరోనా విలయం.. కొత్తగా 10,057 మందికి పాజిటివ్..

కరోనా విలయం.. కొత్తగా 10,057 మందికి పాజిటివ్..

ఏపీలో కరోనా డెంజర్ బెల్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,713 శాంపిల్స్ పరీక్షించగా 10,057 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మంగళవారం 6,996 కేసులు వచ్చాయి. నిన్నటి వాటితో పోలిస్తే దాదాపు ఇవాళ 3,061 కొత్త కేసులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 14,522కు చేరింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,19,64,682 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు 21,24,546 పాజిటివ్ కేసులు రాగా వారిలో 20,65,089 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.

 విశాఖ‌, చిత్తూరు జిల్లాలో డెంజ‌ర్ బెల్

విశాఖ‌, చిత్తూరు జిల్లాలో డెంజ‌ర్ బెల్


రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లోనే క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,827 కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాత చిత్తూరు 1822, గుంటూరు 943, తూర్పు గోదావరి 919, అనంతపురం 861, ప్రకాశం 716, నెల్లూరు 698, కర్నూలు 452, కడప 482 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. అటు శ్రీకాకుళం 407, విజయనగరం 382 కృష్ణా 332, పశ్చిమ గోదావరి 216 కొత్తగా కరోనా బారిన పడ్డారు. కేసుల పెరుగుదలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తున్నారు.

 స్కూళ్ల‌లో క‌రోనా వ్యాప్తి

స్కూళ్ల‌లో క‌రోనా వ్యాప్తి


ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్నారు. ఒకే రోజలోనే 716 కొత్త కేసులు నమోదయ్యాయి. ప‌లు స్కూళ్లలో వైర‌స్ వ్యాప్తి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు స్కూళ్ల‌లో15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెలకొంది. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నతపాఠశాల, చిన్న గంజాం జెడ్పీ హైస్కూల్, అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో ఇద్దరి చొప్పున పాజిటివ్ గా నిర్థారణ అయింది. మార్కాపురం శారదా ఎయిడెడ్ పాఠశాల, కనిగిరి నందన మారెళ్ల, ఒంగోలు క్రేంద్రీయ విద్యాలయం, సింగరాయకొండ మండలం కలికివాయి, పంగులూరు మండలం రేణిగంవరం, యద్దనపూడి మండలం పూనూరు, టంగుటూరు మండలం కొణిజేడు, సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం స్కూళ్లలో ఒక్కొక్కరికి కరోనా సోకింది. యద్దనపూడి మండలం పూనురు , త్రిపురాంతకం మండలం మేడపి స్కూళ్లలో బోధనేతర సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. పాఠ‌శాల‌లో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు క‌ల‌వ‌ప‌డుతున్నారు.

English summary
10,057 new corona cases today in andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X