వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్: ఏడాదిపాటు కరోనాప్రభావం, ఇంట్లో ఉంటే సరిపోతోంది, ఏపీలో ఒక్కరికే పాజిటివ్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం ఏడాదిపాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ 15 రోజులపాటు చర్యలు తీసుకుంటే.. తర్వాత పరిస్థితి ఏంటీ అని అడిగారు. మధ్య ప్రాచ్యలో ఏపీకి చెందిన కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. వారికి కొద్దిరోజులపాటు ఆయాదేశాలు వైద్యం అందజేస్తాయని.. తర్వాత స్వస్థలాలకు పంపిస్తాయని పేర్కొన్నారు. అప్పుడు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సీఎం జగన్ గుర్తుచేశారు. ఏపీలో ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు.

వీరిపై ప్రభావం.

వీరిపై ప్రభావం.

వైరస్ చైనాలోని వుహాన్‌లో ఆవిర్భవించి 5 వేల పైచిలుకు మందిని పొట్టన పెట్టుకుంది. చైనాలో 3 వేల పైచిలుకు మంది చనిపోయిన సంగతి తెలిసిందే. చైనాలో 81 వేల మందికి వ్యాధి సోకితే 65 వేల మంది కోలుకున్నారని జగన్ గుర్తుచేశారు. చైనా నుంచి ఇతర దేశాలకు ప్రజలు వెళ్లడం ద్వారా.. వైరస్ సోకుతున్న సంగతి తెలిసిందే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై వైరస్ ప్రభావం ఉంటుందని చెప్పారు. 60 ఏళ్ల పైబడిన వారు, షుగర్, బీసీ, కిడ్నీ సంబంధిత వ్యాధి, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆస్తమా వ్యాధులు ఉన్నవారిపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పారు.

అప్రమత్తం..

అప్రమత్తం..

వైరస్ వస్తోంది.. పోతోంది అంతా భయపడాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకితే పారసెటమాల్ వేసుకుంటే సరిపోతుందనన్నారు. సీఎం జగన్ లాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో... న్యూమోనియా, టైఫాయిడ్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నామో.. అలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు.

ఇదీ లెక్క..

ఇదీ లెక్క..


వైరస్‌ సోకిన వారి ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నారని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు 81.9 శాంత మంది రికవర్ అయ్యారని పేర్కొన్నారు. కేవలం 13.8 శాతం మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని పేర్కొన్నారు. కేవలం 4.7 శాతం క్రిటికల్‌గా ఉన్నారని.. వారికి ఐసీయూలో పెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని పేర్కొన్నారు. మరికొందరినీ స్టేడియంలో పెట్టే కూడా వైద్యం అందజేస్తున్ానరని తెలిపారు.

ఒక్కరికే పాజిటివ్..

ఒక్కరికే పాజిటివ్..

ఏపీలో 70 శాంపిల్స్ సేకరించామని.. కేవలం ఒక్కరికీ మాత్రమే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. నెల్లూరులో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వేగంగా స్పందించిన చికిత్స అందించామన్నారు. అతను ఉన్న కిలోమీటర్ పరిధిలో 20 వేల మందికి పరీక్షలు చేశామని గుర్తుచేశారు. దేశంలో కరోనా వైరస్‌ను పరీక్షించే ల్యాబ్‌లు 51 ఉన్నాయని... ఏపీలో తిరుపతి, విజయవాడలో కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కాకినాడలో మరో ల్యాబ్ నెలకొల్పాలని కేంద్రప్రభుత్వాన్ని కోరతామని జగన్ తెలిపారు. అనుమానం ఉన్న వారు 104కి కాల్ చేయాలని... మనకు విశాఖలో ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మాత్రమే ఉందని జగన్ వివరించారు. విశాఖలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులో ఉంచామని, విజయవాడలో 50 పడకల ఆస్పత్రి అందుబాటులో ఉందన్నారు.

English summary
coronavirus effect till one year ap cm ys jagan mohan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X