డ్వాక్రా ఉత్పత్తులకు కార్పోరేట్ బ్రాండ్: చంద్రబాబు
హైదరాబాద్, జనవరి 2 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో రిటైల్ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు ఏపీ సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. రిలయన్స్, క్రోమా, వాల్‌మార్ట్, లైఫ్‌స్టైల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రిటైల్ వ్యాపారానికి సంబంధించి తమ కంపెనీల విస్తరణ, పెట్టుబడులపై వారు చర్చించినట్లు సమాచారం.
డ్వాక్రా ఉత్పత్తులను కార్పోరేట్ బ్రాండ్‌తో విక్రయించాలని చంద్రబాబు రిటైల్ మార్కెట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. డ్వాక్రా ఉత్పత్తులను రిటైల్ సంస్థల ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎపి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. డ్వాక్రా ఉత్ప్తత్తులకు నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ జోన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. కొత్త రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటు అనుమతులకు సింగిల్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్వాక్రా ఉత్పత్తుల నాణ్యత, సరుకు బ్రాండింగ్ వంటివాటిని రిటైలర్స్‌కు అప్పగిస్తామని ఆయన చెప్పారు.
యువతీయువకులకు రిటైల్ రంగంలో శిక్షణ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేట్ సంస్థలు సహకారం అందిస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications