వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తున్న జనాలు...ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలుకుతున్న వైనం

పోషకాలతో నిండి రుచికరంగా ఉంటూ సామాన్యులను కష్టసమయంలో ఆదుకునే ఆహార పదార్ధం గుడ్డు. అయితే అలాంటి గుడ్డు ఇప్పుడు ఖరీదై జనాలకు అందుబాటులో లేకుండా పోయింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Egg price Hike: Here 3 Reasons మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి

అమరావతి: పోషకాలతో నిండి రుచికరంగా ఉంటూ సామాన్యులను కష్టసమయంలో ఆదుకునే ఆహార పదార్ధం గుడ్డు. అయితే అలాంటి గుడ్డు ఇప్పుడు ఖరీదై జనాలకు అందుబాటులో లేకుండా పోయింది. గుడ్డు ధర ఇంతము ముందెన్నడూ లేని విధంగా ఒక్కో గుడ్డు ధర 6 రూపాయలు పలుకుతోంది.చలితీవ్రతఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు సరిపడా గుడ్లు ఉత్పత్తి కాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని గుడ్ల వ్యాపారులుచెబుతున్నారు.ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తున్న జనాలు...ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలుకుతున్న వైనం

గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తున్న జనాలు...ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలుకుతున్న వైనం

భూమి మీద దొరికే అత్యంత రుచికరమైన, సురక్షితమైన, పోషకాలు సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటికెలో వండుకోవటానికి వీలైన ఆహారం పదార్ధం

పేరు ఒకటి చెప్పండి...ఈ ప్రశ్నకు అందరూ ముక్త కంఠంతో చెప్పే ఒకే ఒక్క సమాధానం గుడ్డు! అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ అన్ని వయసులవారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా? అంటే దీనికి కూడా జవాబు గుడ్డే! అందుకే గుడ్డు వెరీ గుడ్డు అంటారు. వైద్యులు అందరూ ముక్త ఖంఠంతో ఆరోగ్య ప్రదాయినీగా సూచించే ఈ పోషకాల గని ఇప్పుడు జనాలకు గుడ్లు తేలేసేలా చేస్తోంది. కారణం ఇటీవలి కాలంలో
క్రమంగా పెరుగుతూ వస్తున్న కోడి గుడ్ల ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయి చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ధరకు చేరుకోవడమే. ప్రస్తుతం
గుడ్డు ఖరీదు 6 రూపాయలకు చేరింది. ఓ పక్క కూరగాయాల ధరలు చూస్తే ఆకాశాన్నంటుతుండగా పోనీ ఎప్పట్లాగే ఆపద్భాంధవుడికినిర్వచనం లాంటి గుడ్డుతో కవర్ చేద్దామనుకుంటే అది కూడా హ్యాండిచ్చిన పరిస్థితి. గుడ్డు ఇప్పడు గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిధరతో సామాన్య జనాలను బావురుమనిపిస్తోంది.

 గుడ్డు ధర పైపైకి..

గుడ్డు ధర పైపైకి..

ఈ ఏడాది జూలై నుంచి గుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జూలై నెలలో సరాసరి ఒక గుడ్డు ధర రూ.3.35 ఉండగా ఈనెలలో నవంబర్ 14వ తేదీ మంగళవారం నాటికి ఒక గుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.4.93గా నమోదైంది. ఆ తరువాత
రోజురోజు 2 నుంచి 5 పైసల వరకు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సెల్‌ వ్యాపారులు మార్కెట్‌ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికి రిటైల్ వ్యాపారులు మాత్రం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక గుడ్డును రూ.5.30 నుంచి రూ.6 వరకువిక్రయిస్తున్నారు. ఇక మారుమూల గ్రామాలు, రవాణా సౌకర్యం అంతగా లేని గ్రామాల్లోనైతే ఒక గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

 కారణాలు ఇవీ..

కారణాలు ఇవీ..

గుడ్ల ధర ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు అన్వేషిస్తే ప్రస్తుతం చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కాకపోవడంతో ,ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరింత లోతుగా అధ్యయనం చేస్తే 2012 నుంచి పౌల్ట్రీ రైతులు నష్టాలు వస్తున్నాయన్న
కారణంతో కోడిపిల్లల పెంపకాన్ని తగ్గించడం కూడా గుడ్ల ఉత్పత్తి తగ్గడానికి కారణమైందని, తద్వారా గుడ్ల ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు తెలియజేశారు. మరోవైపు కూరగాయల ధరలు విపరీతం గా పెరిగి వాటిని కొనలేక జనాలు గుడ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తుండడం కూడా
ధర పెరుగుదలకు మరో కారణమని విశ్లేషిస్తున్నారు.

 ఇంత ధర ఎన్నడూ చూడలేదు...

ఇంత ధర ఎన్నడూ చూడలేదు...

ఏదేమైనా గుడ్డు ధర ఇంతలా పెరగడం ఎప్పుడు చూడలేదని అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.గుడ్డు ఖరీదుబాగా పెరిగిపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగానే ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పైగా గుడ్ల ఖరీదు దృష్ట్యా ఇప్పడుగుడ్లు దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి వస్తోందని, లేకపోతే ఒక్క గుడ్డు పగిలినా నష్టపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు.గుడ్ల ఉత్పత్తి పెరిగినప్పుడే గుడ్ల ధరలు దిగివస్తాయంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని తమ అంచనా ప్రకారం
మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని గుడ్ల వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Hike in the price of vegetables and drop in production has sent the cost of eggs skyrocketingfor the last few days in Namakkal, a major egg production hub in the country. The wholesale egg price has soared to Rs 5.16 at Namakkal on Friday, the highest ever so far.The poultry industry here is witnessing a steady fall in the production of eggs for the past few months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X