వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ycp లో ముసలం.. నాయకత్వంపై తిరుగుబాటు.. అజ్ఞాతంలో 10 మంది నాయకులు

|
Google Oneindia TeluguNews

అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం రేగింది. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయితీలో ఆ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు సమావేశానికి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. స్థానిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. రాజకీయంగా ఈ విషయం కృష్ణా జిల్లావ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన కౌన్సిలర్లు తాము విజయం సాధించినా కనీస విలువ కూడా ఇవ్వడంలేదని కొంతకాలం నుంచి వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం పెడచెవిన పెట్టింది. దాని ఫలితమే వారంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు.

 రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి?

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి?

నందిగామ నగర పంచాయితీలో మొత్తం 20 వార్డులు ఉండగా, 13 వార్డుల్లో తెలుగుదేశం, ఆరు వార్డుల్లో తెలుగుదేశం, మరొక వార్డులో జనసేన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించడంతో మండవ వరలక్ష్మిని చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. కమిషనర్ జయరాం తమకు విలువివ్వడంలేదంటూ వరలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలన కూడా కొన్నాళ్లు స్తంభించింది. కమిషనర్ తోపాటు స్థానిక నాయకుల వైఖరిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో జరిగిన కౌన్సిల్ సమావేశాలు కూడా ఇబ్బందికర పరిణామాల మధ్య జరిగాయి. వైసీపీ నేతలు ఆమెతో మాట్లాడి సర్దుబాటు చేశారు. అనారోగ్యానికి గురవడంతో మార్చి నుంచి చికిత్స పొందుతున్నారు.

 వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నం

వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నం


ఈ సందర్భంగా పరిపాలన కోసం వైస్ చైర్ పర్సన్ మాడుగుల నాగరత్నంను ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు స్వీకరించేరోజు తమకు సమాచారం ఇవ్వలేదని, తమ అనుమతి లేకుండా, తమ ప్రమేయం లేకుండా తమ వార్డుల్లో పనులు జరుగుతున్నాయని, ప్రజలకు పనులకు సంబంధించి ఏం చెప్పుకోవాలో అర్థంకాక పరువు పోతోందన్నారు.

 అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు

అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు

తమవార్డుల్లో పనుల గురించి అధికారులును కలిసినా ేమీ మాట్లాడంలేదని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అజ్ఞాతంలోకి వెళ్లిన కౌన్సిలర్ల కోసంముఖ్య నాయకులు ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. అసమ్మతి కౌన్సిలర్లంతా ఒకచోట సమావేశమైన వీడియో సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నందిగామ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

English summary
Councilors tossing the rebel baton over the YCP leadership
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X