నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిఎస్‌ఎల్‌వి-సి26 రాకెట్ కౌంట్‌డౌన్ షురూ: 16న నింగికి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మూడు నెలల వ్యవధిలోని మరో ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి అక్టోబర్16న తెల్లవారుజామున 1:32 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 26 రాకెట్ ప్రయోగం జరగనుంది.

ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 6:32గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ రాకెట్ ద్వారా 1425కిలోల బరువుగల ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి) ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సి 26 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ప్రయోగానికి 67గంటల ముందు ప్రారంభమైక కౌంట్‌డౌన్ సజావుగా సాగితే అక్టోబర్ 16న తెల్లవారుజామున 1:32గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. నావిగేషన్ సేవలను మెరుగుపరిచేందుకు ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందించారు.

Countdown begins for launch of PSLV-C26 carrying IRNSS-1C

కౌంట్‌డౌన్ ప్రారంభమైనంతరం రాకెట్‌లోని నాలుగో దశకు ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. సోమవారం రాత్రికి శాస్తవ్రేత్తలు రాకెట్‌కు ఆర్మింగ్ ఆపరేషన్ నిర్వహించి రాకెట్‌లోని అన్ని భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని సజావుగా ఉంటే రాకెట్‌లోని రెండో దశలో కూడా బుధవారం ఉదయం ఇంధనాన్ని నింపి తుది పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి 8గంటల ముందు రాకెట్‌కు విద్యుత్తు సరఫరా ఇస్తారు.

English summary
The countdown for the launch of IRNSS-1C, the third in the series of seven navigation satellites, has commenced today at Satish Dhawan Space Centre (SDSC)-SHAR, Sriharikota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X