మరో షాక్: ఈడీ ఛార్జీషీట్‌కు కోర్టు ఓకే, జగన్, సాయికి నోటీసులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్! జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జీషీటును దాఖలు చేసింది. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
దీంతో ఈ కేసుకు సంబంధించి జగన్‌కు, విజయ సాయి రెడ్డికి, జగతి పబ్లికేషన్స్‌లకు నోటీసులు జారీ చేశారు. మే 2వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
కాగా, జగన్ ఆస్తుల కేసులో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల మార్చి నెలాఖరులో జఫ్తు చేసింది. ఇందూకు చెందిన రూ.132 కోట్ల ఆస్తులను జఫ్తు చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే.

అప్పుడు మొత్తం రూ.232కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు. జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
- మోదటి చార్జీషీట్ పరిగణలోకి తీసుకున్న ఈడీ, వైజగన ్జగన్ ఖు ఈడీ సమన్లు, 30న కోర్టుకు హాజరపు కావాలని ఆదేశం, తజగన్ తో పాటు విజయ సాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ కు కసమన్లు,
నాంపల్లి కోర్టు, జగన్ విజయ సాయి, జగతి, సమన్లు, మే 2న హాజరు కావాలని,












Click it and Unblock the Notifications