వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా విలయం: భారీ రికార్డు -టీపీఎంలో దేశంలోనే టాప్ -కొత్తగా 520 కేసులు, 2మరణాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కరోనా టెస్టులు కొనసాగిస్తున్నప్పటికీ, నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో తొలి నుంచీ దూకుడు ప్రదర్శిస్తోన్న ఏపీ తాజాగా ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కొత్త కేసులు, మరణాల తగ్గుదలతోపాటు డిశ్చారీలు పెరగడంతో యాక్టివ్ కేసులు అదుపులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

జగన్‌కు మళ్లీ షాక్ -ఓటరు జాబితాపై నిమ్మగడ్డ ఆదేశాలు -ఫిబ్రవరిలోనే పోల్స్ -సీఎస్‌కు మరో లేఖజగన్‌కు మళ్లీ షాక్ -ఓటరు జాబితాపై నిమ్మగడ్డ ఆదేశాలు -ఫిబ్రవరిలోనే పోల్స్ -సీఎస్‌కు మరో లేఖ

కొత్తగా 520 కేసులు..

కొత్తగా 520 కేసులు..

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 64,425 శాంపిళ్లను పరీక్షించారు. కొత్తగా 520 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల74వేల515కు, మొత్తం మరణాల సంఖ్య 7049కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 519 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,62,230కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,236 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

ట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లుట్రంప్‌కు మోదీ ఆఖరి పంచ్ -గ్లోబ్‌ను గబ్బు పట్టించిన పాపం ఎవరిది బాసు? పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు

ఆ మూడు జిల్లాల్లో..

ఆ మూడు జిల్లాల్లో..

ఏపీ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో చిత్తూరులో అత్యధికంగా 108 కేసులు, కృష్ణా జిల్లాలో 71, వెస్ట్ గోదావరిలో 69, గుంటైరు 64, ఈస్ట్ గోదావరిలో 59 కొత్త కేసులు వచ్చాయి. కడపలో అత్యల్పంగా 9 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో కోవిడ్‌ బారినపడి చనిపోయిన ఇద్దరిలో ఒకరు కృష్ణా, మరొకరు విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. కాగా,

టీపీఎంలో రికార్డు.. దేశంలోనే తొలిగా

టీపీఎంలో రికార్డు.. దేశంలోనే తొలిగా

కొవిడ్ విపత్తు నిర్వహణలో జగన్ సర్కారు శుక్రవారం మరో మైలురాయిని దాటింది. ప్రతి 10 లక్షల మందిలో టెస్టుల సంఖ్యకు సంబంధించి (tests per million population - TPM-టీపీఎంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఏపీలో ప్రతి 10 లక్షల మంది(మిలియన్)లో 2, 00,367 మందికి టెస్టులు చేసి అరుదైన రికార్డు సాధించింది. గురువారం నాటి 64,425 టెస్టులతో కలిపి ఏపీలో ఇప్పటిదాకా మొత్తం 1కోటి 6లక్షల 99వేల 622 శాంపిళ్లను పరీక్షించారు. తద్వారా టీఎంపీ 2లక్షలు దాటిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రతి 10లక్షల మందిలో టెస్టులకు సంబంధించి ఏపీ తర్వాతి స్థానంలో కేరళ (1.89 లక్షలు), కర్ణాటక (1.80లక్షలు) నిలిచాయి. ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 8.17 శాతంగా ఉంది.

English summary
Andhra Pradesh on Friday crossed another milestone in COVID-19 management as it accomplished over two lakh sample tests per million population (TPM). In the 24 hours ending 9 am on Friday, 64,425 tests were carried out and that turned out 520 positives for COVID-19, taking the states infection count to 8,74,515.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X