వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కేసులు -కొత్తగా కేవలం 128 కేసులు, 3 మరణాలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గాయి. ఏడు నెలల వ్యవధిలో అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. సెలవు రోజు కావడంతో నిన్న టెస్టుల సంఖ్య తగ్గిపోగా, అందుకు తగ్గట్లే కేసులు కూడా తగ్గాయి. మరోవైపు డిశ్చార్జీల సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి..

Recommended Video

232 new corona cases reported in andhra pradesh

రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణురాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 29,714 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 128 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,83,210కి చేరింది.

 covid-19 in ap: 128 new cases, 3 deaths in last 24 hrs, tally reaches 8,83,210

కరోనా మహమ్మారి బారిన పడి సోమవారం ముగ్గురు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 7,118కు చేరింది.

ఏపీలు కొత్తగా 252 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 8,73,149కి చేరింది. యాక్టివ్‌ కేసులు 2,943కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,20,02,494 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగాఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా

జిల్లాల వ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య చూస్తే, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కొత్త కేసులు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కరోనా కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సైతం రాష్ట్రంలోనే అత్యల్పంగా 35 ఉన్నాయి.

English summary
Andhra Pradesh reported 128 fresh COVID-19 cases, 252 recoveries and three deaths, while the active cases slid below 3000 in 24 hours ending 9 am on Monday. After 1. 20 crore sample tests, the gross confirmed positives touched 8,83,210 with an overall positivity rate of 7.36 per cent, a health department bulletin said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X