వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన మరణాలు -కొత్తగా 212 కేసులు విజయనగరంలో జోరో -వ్యాక్సిన్ డ్రైరన్ సక్సెస్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా, మరణాలు మళ్లీ పెరిరగడం కలవరపెడుతోంది. నిన్న ఆదివారం కారణంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గించగా, కేసులు కూడా అంతే స్థాయిలో పడిపోయాయి. మరోవైపు సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వ్యాక్సినేషన్ డ్రైరన్ విజయవంతమైంది. వివరాల్లోకి వెళితే..

year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్year ender 2020: సెక్స్ కలాపాలు -పట్టపగలే జోరుగా రతిక్రీడ -కండోమ్స్ వాడకంలో హైదరాబాద్ టాప్

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ లోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,381 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 212 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,81,273కి పెరిగింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 53 కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 32, తూర్పు గోదావరిలో 21 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 4, శ్రీకాకుళంలో 5, పశ్చిమ గోదావరిలో 5, నెల్లూరు జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 8, కడప జిల్లాలో 9 కొత్త కేసులు వచ్చాయి.

covid-19 in ap: 212 new cases, 4 deaths in last 24 hrs, state tally reaches to 8,81,273

రాష్ట్రంలో కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఆదివారం ఏకంగా నలుగురు మరణించారు. గత వారం రోజులుగా మరణాల సంఖ్య రెండును దాటకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నా, మళ్లీ ఒకేసారి నాలుగుకు పెరగడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,098కు చేరింది.

కొత్తగా 410 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, రాష్ట్రంలో రికవరీల సంఖ్య 8,70,752కు పెరిగింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,423గా ఉంది. ఏపీలో ఇప్పటిదాకా 1,16,57,884 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో శని, ఆదివారాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇక..

షాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలంషాకింగ్: పతనం దిశగా బీహార్ సర్కార్ -సీఎం పదవి వద్దన్న నితీశ్ -బీజేపీ గూటికి జేడీయూ ఎమ్మెల్యేలు -కలకలం

తొలి విడతలో కొటి మందికి వ్యాక్సిన్లు అందించాలనుకుంటోన్న ఏపీ సర్కారు.. ఆ ప్రక్రియలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్‌‌ వ్యాక్సిన్ డ్రై రన్ ను విజయవంతంగా నిర్వహించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు.

English summary
Coronavirus cases in Andhra Pradesh have seen a drastic fall compared to yesterday with less than 300 cases on Monday. According to the latest health bulletin released by the state w health department, in the last 24 hours, 37,381 coronavirus tests were conducted in Andhra Pradesh, where as many as 212 new positive cases were registered taking the total number of coronavirus cases in the state so far to 8,81,273.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X