ఏపీలో పెరుగుతున్న కోవిడ్ ప్రభావం-ఈ జిల్లాల్లో ఎక్కువగా యాక్టివ్ కేసులు..!
ఏపీలో కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య గోప్యంగా ఉంటోంది. వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో వాస్తవ కేసుల సంఖ్య తెలియడం లేదు.
రాష్ట్రంలో గత 24 గంటల్లోనే అనకాపల్లి జిల్లాలో మూడు కోవిడ్ కేసులు, విశాఖ జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు నమోదైంది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారికంగా కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ వాస్తవ పరిస్ధితి అర్ధం కావడం లేదు.

రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా లేకపోవడంతో ప్రభుత్వం రెగ్యులర్ పరీక్షలు నిర్వహించడం లేదు. మరోవైపు శీతాకాలం కావడంతో వైరస్ లక్షణాలు ఉన్నా జనం సహజమే అనుకుంటున్నారు. దీంతో వీరు ఆస్పత్రులకు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈలోపు వైరస్ లక్షణాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా కోవిడ్ పరీక్షలు ప్రారంభించాలని జనం కోరుతున్నారు. ఈసారి ఒమిక్రాన్ జేఎన్1 వైరస్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దులతో పాటు విమానాశ్రయాలు, బస్టాండ్లలోనూ కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రభుత్వం సాధారణ అలర్ట్ ఇచ్చి వదిలేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కోవిడ్ సోకిన వారు కుప్పలు తెప్పలుగా రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి వల్ల రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, కాంటాక్టులకు వైరస్ సోకుతోంది. దీని ప్రభావం తెలియాలంటే మరో వారం రోజులుగా ఆగాలని డాక్టర్లు చెబుతున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications