ఆ నిధులు రెండువారాల్లో తిరిగి జమచెయ్యాలి.. జగన్ సర్కార్ కు సుప్రీం ధర్మాసనం షాక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణకు వాడాల్సిన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను పర్శనల్ ఖాతాలకు మళ్ళించి వినియోగించారు. దీనిపై కేసు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. గతంలోనూ సుప్రీం ధర్మాసనం జగన్ ప్రభుత్వానికి ఈ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో మారు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లించిన కోవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డిఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం ఆర్. షా ధర్మాసనం ఆదేశించింది.

covid funds should be re-deposited in SDRF in two weeks; Supreme Court shocked Jagan govt!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిడి ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 1100 కోట్లను తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతా కు మళ్ళించాలని సూచించింది. అంతేకాదు కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో ఆ ఫిర్యాదును పరిష్కరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ చర్య విపత్తు నిర్వహణ చట్టం మరియు విభజన చట్టం రెండింటికీ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లింపుపై గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇక ఏపీ సర్కార్ చేసిన నిధుల మళ్లింపు ను నిలుపుదల చేస్తూ గతంలోనే సుప్రీం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లించిన డబ్బులు తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలంటూ ఆదేశించింది. మరి సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 11వందల కోట్ల రూపాయల నగదును రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధికి జమ చెయ్యాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్ధిక సంక్షోభంలో ఈ డబ్బు జమ చేస్తుందా? సుప్రీం ఆదేశాలపై ఏం చెయ్యనుంది అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+