ఏపీలోనూ బెనిఫిట్ షోల రద్దు- ఇక తప్పదా..!?
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణలో ఇక బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వమని.. టికెట్ ధరలు పెంచేందుకు అంగీకరించమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీని పైన సినీ ఇండస్ట్రీ మినహా మిగిలిన వారు హర్షిస్తున్నారు. రేవంత్ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే తరహాలో ఏపీలోనూ నిర్ణయం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. కూటమి నేతలతో సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తు న్నాయి. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఇదే బాటలో పయనిస్తుందా.. ఏం జరుగుతోంది.
ఎవరికి బెనిఫిట్
ఏపీలోనూ తెలంగాణలో తరహాలో సినిమా విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వవద్దంటూ ప్రభుత్వానికి సూచనలు అందుతున్నాయి. తెలంగాణలో అల్లు అర్జున్ పుష్ప -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన లో మహిళ ప్రాణాలు పోయిన ఘటన ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీలోని కూటమి నేతలు సైతం మద్దతు పలికారు. సినీ ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

తెలంగాణ నిర్ణయంతో
దీంతో, ఇప్పుడు ఏపీలోనూ ఈ నిర్ణయం అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ఘటన పైన స్పందించిన ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్ తాను రేవంత్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని .. అదే విధంగా బెనిఫిట్ షో లు రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత బండారు సత్యనారా యణ సైతం బెనిఫిట్ షో ఎవరి కోసం వేస్తున్నారని.. ఎవరికి బెనిఫిట్ కలుగుతోందని ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేఖ రాసారు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం పరిపాటిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడమేనని పేర్కొన్నారు.
ఏపీలోనూ రద్దు చేయాలి
టికెట్ ధరలను పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించే విధానాలను సీపీఐ ఖండిస్తుందని స్పష్టం చేసారు. సినిమా రంగానికి తలొగ్గి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టికెట్ల ధరలను విపరీతంగా పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతిం చాయని విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపో వడంపై రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తర్వాత తెలంగాణలో సినిమా టికెట్ల ధర లను పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించా రని చెప్పారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమనే ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications