ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణకు సిపిఎం షాక్: వైకాపా ఖాతాలో ఖమ్మం

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: ఖమ్మం లోకసభ స్థానాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాతాలో చేరడం వెనక పెద్ద కథే ఉంది. కాంగ్రెసు మద్దతుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీకి దిగారు. పోలింగ్ పూర్తయిన తర్వాత నారాయణ సిపిఎంపై విరుచుకుపడిన విషయం గుర్తుండే ఉంటుంది. పోలింగ్ జరిగిన వెంటనే ఫలితాన్ని నారాయణ పసిగట్టే సిపిఎం విరుచుకుపడ్డారు. దానికి సిపిఎం నాయకుడు రాఘవులు ధీటైన సమాధానం ఇవ్వడం వేరే విషయం.

ఖమ్మం లోకసభ స్థానంలో వామపక్షాలు కలిసి పనిచేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేది. సిపిఎం మద్దతు తెలిపి ఉంటే నారాయణ విజయం సాధించి ఉండేవారు. అయితే, సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు ప్రకటించింది. ఖమ్మం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి విజయం వెనక సిపిఎం మద్దతు ఉందనేది స్పష్టం.

ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు గణనీయమైన బలం ఉంది. వామపక్షాలు చీలిపోవడం ఈసారి ఖమ్మం జిల్లా ప్రత్యేకత. సిపిఐ తెలంగాణలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోగా, సిపిఎం తెరాసకు మద్దతు ఇవ్వాలని తన పార్టీ శ్రేణులకు సూచించింది. ఇది ఖమ్మం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి రాగా, తెలంగాణలో తెరాసకు కూడా కలిసి వచ్చి ఉంటుంది.

సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్న తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పైగా, తెరాస ప్రాబల్యం ఖమ్మం జిల్లాలో ఏ మాత్రం లేదు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం శాసనసభా స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అది కూడా జలగం వెంకటరావు బలమైన అభ్యర్థి కావడం వల్ల విజయం సాధ్యమైంది.

English summary
Khammam Lok Sabha seat has been grabbed by YS Jagan's YSR Congress candidate Srinivas Reddy with the support of CPM, giving a shock to CPI leader K Narayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X