వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టం లేకుండా ఒత్తిడి చేస్తున్నారు, ఆపకుంటే..: బాబు ప్రభుత్వానికి హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విశాఖ: తూర్పు గోదావరి జిల్లా తొండంగి ప్రాంతంలో దివిస్ కంపెనీకి బలవంతంగా భూములు సేకరించడాన్ని నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు శుక్రవారం నాడు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు ఇష్టం లేకపోయినా భూసేకరణ సరికాదన్నారు.

రైతులకు ఇష్టం లేకపోతే బలవంతంగా భూసేకరణ జరపవద్దన్నారు. ఈ భూసేకరణ రైతులను ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. అభివృద్ధి పేరుతో భూములు సేకరించి వాటిని ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే రైతులు ఎలా బతుకుతారో చెప్పాలన్నారు.

 CPM leaders warn Chandrababu Naigu government

ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా వ్యవహరిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందన్నారు.
భూసేకరణకు వ్యతిరేకంగా తొండంగిలో గురువారం నాడు నిర్వహించిన సభలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.

రైతుల హక్కుల కోసం ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, లాఠీఛార్జ్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దివిస్ పరిశ్రమ భూసేకరణను నిలిపివేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

English summary
CPM leaders warn Chandrababu Naigu government over Divis Factory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X