వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"స్పీచులు కాదు, బరిలో దిగు, చెగువేరా పోరాటం వేరు.."

|
Google Oneindia TeluguNews

విజయవాడ : తన ప్రసంగాల్లోను.. సినిమాల్లోను.. చెగువేరా ప్రస్తావన తీసుకురావడానికి పవన్ ఇష్టపడుతుంటాడు. అందుకే.. ఆయన సినిమాల్లో కొన్ని చోట్ల చెగువేరా బొమ్మలు దర్శనమిస్తాయి. ఇక ప్రసంగాల్లో అయితే చెగువేరా పోరాట పటిమ గురించి పవన్ మాట్లాడిన సందర్బాలు చాలానేడ ఉన్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో.. పవన్ చూపు లెఫ్ట్ పార్టీల వైపు మళ్లుతోందా..? అన్న సంశయం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిస్తూ.. సీపీఐ, సీపీఎం నేతలు పవన్ నాయకత్వాన్ని పరోక్షంగా సమర్థించే వ్యాఖ్యలు చేస్తున్నారు.

pawan

మొన్నటి తిరుపతి, కాకినాడ సభల ముందు వరకు టీడీపీ, బీజేపీకి ప్రత్యక్ష మద్దతు పలుకుతూ వచ్చిన పవన్.. ఇప్పుడు ఎవరితో కలిసి ముందడుగు వేస్తారు..? లేక సోలో గానే భవిష్యత్తు రాజకీయాలను ప్లాన్ చేసుకుంటారా..? లేదంటే పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యాడన్న వాదనకు ఫుల్ స్టాప్ పెడుతూ.. మళ్లీ సినిమాలే చేసుకుంటారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం.

ఇదంతా ఇలా ఉంటే.. సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు పవన్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ చెగువేరాను ఆరాధించడం మంచి విషయమేనన్న రాఘవులు.. చెగువేరా తన పోరాటాన్ని తుపాకీ మార్గంలో నడిపిన విషయాన్ని మరిచిపోకూడదని పవన్ కు సూచించారు.

పవన్ తుపాకీ పట్టుకోవాలని తాము కోరుకోవడం లేదని, ప్రసంగాలకే పరిమితవకుండా నిజమైన పోరాటంలోకి దిగాలని హితవు పలికారు. హోదాపై పవన్ క్రియాశీలకంగా అడుగేస్తే ప్రత్యేక హోదా సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు రాఘవులు. లెఫ్ట్ పార్టీ నేతల మాటలు బాగానే ఉన్నాయి గానీ అసలు పవన్ మదిలో ఏముందనేది లెక్క తేలాల్సిన అంశం. జనం ముందు నిలబడి పోరాటం చేస్తారో లేక గతంలో లాగే మళ్లీ సినిమాల బిజీలో పడి పాలిటిక్స్ ను పక్కనబెడుతారో వేచి చూడాలి.

English summary
CPM Leader Raghuvulu made some interesting comments on Pawan Kalyan. He suggested him to fight for special status,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X