చంద్రబాబుకు చిరంజీవి నేత బాసట: కెసిఆర్‌ఫై ఫైర్

CR supports Chandrababu, opposes KCR
తిరుపతి/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ద్వంద్వ నీతితో ప్రజలను ఇంకా రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. అదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడారు. కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సి. రామచంద్రయ్య సన్నిహితుడు.

తెలంగాణ బిల్లులోనే పోలవరం విషయం ఉందని అప్పుడు వ్యతిరేకించని కెసిఆర్ ఇప్పుడు రాద్ధాంతం చేయడం అనవసరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై ఇప్పుడే విమర్శలు చేయడం సరికాదని రామచంద్రయ్య తెలిపారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి రామచంద్రయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

పార్లమెంటులో పోలవరం బిల్లు ఆమోదం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం విషయంలో కేంద్రం ఎవరినీ సంప్రదించకుండా దూకుడుగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.

ఖమ్మం జిల్లాలో ఆదివాసీలను దృష్టిలో ఉంచుకున్న పోలవరంపై తెలంగాణ బిల్లులో పొందుపర్చిన విధంగా కొనసాగాలని డీఎస్ అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+